BigTV English

Netherlands Shock : జింబాబ్వేకు నెదర్లాండ్స్ షాక్..సెమీస్ ఆశలు గల్లంతు

Netherlands Shock : జింబాబ్వేకు నెదర్లాండ్స్ షాక్..సెమీస్ ఆశలు గల్లంతు

Netherlands Shock : టీ20 వరల్డ్ కప్ లో ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన జింబాబ్వేకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. వరసగా 3 పరాజయాలు ఎదుర్కొన్న నెదర్లాండ్స్ టోర్నిలో తొలి విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే నిర్దేశించిన 118 పరుగుల టార్గెట్ ను 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. నెదర్లాండ్స్ జట్టులో మాక్స్ ఓ దౌడ్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టాప్ కూపర్ 32 పరుగులతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో సికిందర్ రాజా 40 పరుగులు, సీన్ విలియమ్స్ 28 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లలో ఒక్కరూ కూడా రెండెంకెల స్కోరు సాధించలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకేరన్ 3 వికెట్లు, గోవర్ , బీక్, లీడే రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడిన నెదర్లాండ్స్ కు ఇదే తొలి విజయం . మరో మ్యాచ్ మాత్రమే ఆ జట్టు ఆడాల్సిఉంది. ఇక జింబాబ్వే సెమీస్ అవకాశాలు ఈ మ్యాచ్ ఓటమితో మూతపడ్డాయి. ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన జింబాబ్వే ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. రెండు పరాజయాలు చవిచూసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో జింబాబ్వే ఖాతాలో 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. చివరి మ్యాచ్ లో భారత్ తో ఆ జట్టు తలపడనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×