BigTV English

Netherlands vs USA: నెదర్లాండ్స్‌ పరుగులకు బ్రేకులు వేస్తున్న యూఎస్ఏ బౌలర్లు.. 200 మార్క్ దాటుతారా?

Netherlands vs USA: నెదర్లాండ్స్‌ పరుగులకు బ్రేకులు వేస్తున్న యూఎస్ఏ బౌలర్లు.. 200 మార్క్ దాటుతారా?

Cricket Updates: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా ఈ రోజు నెదర్లాండ్స్‌, అమెరికా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ టీమ్.. నెదర్లాండ్స్ టీమ్‌ను తక్కువ పరుగులు ఇస్తూ కట్టడి చేస్తున్నది. 23 ఓవర్ల వరకు ఓవరాల్ స్కోర్‌ను సెంచరీ దాటనివ్వలేదు. యూఎస్ఏ బౌలర్లు తక్కువ పరుగులు ఇస్తూ నెదర్లాండ్స్ టీమ్ పై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా, 40 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ టీమ్ 5 వికెట్లు నష్టపోయి 171 పరుగులు మాత్రమే సాధించింది. నెదర్లాండ్స్ బ్యాట్‌మెన్ విక్రమ్ సింగ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆ టీమ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 59 పరుగులు సాధించి పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్ ఓ దాడ్ 49 పరుగులతో ఔటయ్యాడు. ప్రస్తుతం స్కాట్ ఎడవర్డ్స్, షరీజ్ అహ్మద్‌లు క్రీజులో ఉన్నారు.


యూఎస్ఏ బౌలర్ మిలింద్ కుమార్ నెదర్లాండ్ బ్యాట్‌మెన్లను కట్టడి చేస్తున్నాడు. ఆయన 5 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఓ కీలక వికెట్ తీశాడు. జునోయ్ డ్రైస్‌డేల్, స్టీవెన్ టైలర్‌లు కూడా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Also Read: Seethakka: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా?: కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్


నెదర్లాండ్స్‌లోని వూర్‌బర్గ్‌లో ఈ మ్యాచ్ జరుగుతున్నది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ మొదలైంది. ఈ లీగ్‌లో అమెరికాకు ఇది రెండో మ్యాచ్.

నెదర్లాండ్స్ జట్టు:

మైఖేల్ లేవిట్, మ్యాక్స్ ఓ దాడ్, విక్రమ్ సింగ్, వెస్లీ బరేసి, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్&వికెట్ కీపర్), నోవా క్రోస్, షరీజ్ అహ్మద్, కైల్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్, వివియన్ కింగ్మా.

యూఎస్ఏ స్క్వాడ్:

స్టీవెన్ టైలర్, స్మిత్ పటేల్(వికెట్ కీపర్), మొనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, మిలింద్ కుమార్, షయన్ జహంగీర్, షాడ్లీ వానర్ షాల్విక్, హర్మీత్ సింగ్, నోస్తుషా కెంజిగ్, జెస్సీ సింగ్, జునోయ్ డ్రైస్‌డేల్.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×