BigTV English

Memes on Pakistan team: టీమిండియాను ఓడించేందుకు పాక్ కొత్త కుట్రలు..?

Memes on Pakistan team: టీమిండియాను ఓడించేందుకు పాక్ కొత్త కుట్రలు..?

Memes on Pakistan team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం రోజు కీలక పోరు జరగబోతోంది. దాయాది పోరులో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతులో తన తొలి మ్యాచ్ ని ఓడిపోయింది. భారత్ తన రెండవ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 

ఎందుకంటే చాలా సంవత్సరాలుగా భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడ్డాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు 2024 టీ-20 ప్రపంచ కప్ లో తలపడ్డాయి. తాజాగా మరోసారి పోరుకు సిద్ధం కావడంతో క్రీడాభిమానులలో ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణం తలపించేది. ప్లేయర్ల మధ్య వాగ్వాదం, ఉరిమి చూసుకోవడం వంటివి కనిపించేవి.


అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే భద్రత ఏర్పాట్లు భారీగా ఉండేవి. అలాంటి మ్యాచ్ లు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఫిబ్రవరి 23న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో.. టీమ్ ఇండియాని ఓడించేందుకు పాకిస్తాన్ కుట్రలు రచిస్తోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ట్రై – నేషన్ సిరీస్ ఫైనల్ సందర్భంగా ఓ నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది.

దీంతో మ్యాచ్ కి కాసేపు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆ పిల్లిపై ఓ గ్రద్ద దాడి చేసేందుకు ప్రయత్నించినా.. అది అదృష్టవశాత్తు తప్పించుకుంది. అనంతరం అది మైదానం నుంచి వెళ్ళిపోయింది. ఇక 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలోని మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోని రెండవ ఇన్నింగ్స్ సమయంలో ఈ నల్ల పిల్లి మైదానంలో మరోసారి కనిపించింది.

దీంతో ఆ నల్ల పిల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. టీమ్ ఇండియాని ఓడించేందుకు ఆ నల్ల పిల్లిని ఉపయోగించుకోవాలని చూస్తుందట పాకిస్తాన్. దానిని ఉపయోగించుకొని భారత ఆటగాళ్ల మైండ్ నీ డైవర్ట్ చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సమయంలో ఈ ప్రణాళికని రచిస్తున్నారట.

 

ఎందుకంటే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అంటే చాలు తన బ్యాట్ కి చక్కగా పని చెబుతాడు. కోహ్లీ చాలా ఏళ్లుగా పాక్ జట్టును ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నీ పెబిలియన్ చేర్చేందుకు ఆ నల్ల పిండిని పాకిస్తాన్ ఎత్తు ఉపయోగించుకోవాలని చూస్తుందని ఓ కామెంటేటర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై భారత క్రీడాభిమానులు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×