Tollywood Hero: ఏ మనిషి ఎప్పుడు ఒకేలా కనిపించడు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. 20 ఏళ్ళ వయస్సులో ఉన్నట్లు 60 ఏళ్ళ వయస్సులో కనిపించరు. అంతెందుకు మన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు చూస్తే.. ఏంటి అప్పుడు ఇంత సన్నగా ఉండేవారా.. ? అని అడగకుండా పోరు. ఇక సెలబ్రిటీలు కూడా అంతే. వారి యుక్తవయస్సులో ఉన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తే గుర్తుపట్టడం చాలా కష్టమే. ఇదుగో ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు. టక్కున గుర్తుపట్టమంటే మీ వల్ల కాదు.
సరే హింట్ ఇవ్వమంటారా.. ? అతను హీరోగా నటించి మహిళా ప్రేక్షకుల మనస్సులో మారాజుగా కొలువై ఉన్నాడు. ఇక హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఆయన నటించాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ రెండు విషయాలు చాలు.. ఆయన ఎవరో కనిపెట్టడానికి అంటారా..? ఓకే. ఆయనే జగపతి బాబు.
హీరో జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ విబి రాజేంద్రప్రసాద్ తనయుడు. చిన్నతనం నుంచే ఇంట్లో సినిమా వాతావరణం బాగా అలవాటు పడడంతో చదువు పూర్తిచేసి తండ్రికి.. తాను హీరో అవ్వాలని చెప్పడం జరిగింది. వెంటనే తండ్రి రాజేంద్రప్రసాద్.. తన బ్యానర్ లోనే కొడుకును సింహ స్వప్నం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ సినిమా అవ్వగానే అడవిలో అభిమన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మొదటి నుంచి తన గొంతు బాగోదు అని.. తన దొంత డబ్బింగ్ చెప్పకుండా.. వేరొకరితో డబ్బింగ్ చెప్పించుకున్నాడు జగ్గూభాయ్. ఆ తరువాత ఆయనే స్వయంగా సబ్బింగ్ చెప్పుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యి మంచి పేరు తెచ్చుకున్నాడు జగపతి బాబు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా జగ్గూభాయ్ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక ఇండస్ట్రీలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్న నేపథ్యంలో.. హీరోగా సినిమాలు తగ్గించి విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు.
లెజెండ్ సినిమాతో జగ్గూభాయ్ దశ తిరిగిపోయింది. ఆ సినిమా తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పొచ్చు. విలన్, సపోర్టివ్ రోల్స్ లో స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో జగ్గూభాయ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఆయన తెలుగులో పెట్టే క్యాప్షన్స్ అయితే క్రేజీగా ఉంటాయి. నిత్యం వెకేషన్ కు వెళ్ళింది.. కొత్త ఫోటోషూట్ చేసింది.. ఇంట్లో కాఫీ కలుపుకున్నది.. ఆమ్లెట్ వేసుకున్నది.. ఇలా ప్రతిదీ అచ్చ తెలుగులో చెప్తూ చిన్న చిన్న వీడియోలును పోస్ట్ చేస్తూ ఉంటాడు.
తాజాగా జగపతి బాబు.. తన టీనేజ్ లో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఒక టెంపుల్ కు వెళ్ళినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ” నేనుఎక్కడ ఉన్నానో చెప్పండి చూద్దాం” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అందరూ బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని కనిపించారు. అసలు నిజం చెప్పాలంటే ఇందులో జగ్గుభాయ్ ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. గట్టిగా వెతికితే.. కుడివైపు చివర్లో నవ్వులు చిందిస్తూ కనిపిస్తాడు వీరమాచినేని జగపతి చౌదరి. జగ్గూభాయ్ అసలు పేరు అదేలెండి. సినిమాల్లోకి రాకముందే ఈ ఫోటో దిగినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Nenu ekada unano Chepandi chuddham. pic.twitter.com/OgKBY3GDuP
— Jaggu Bhai (@IamJagguBhai) February 22, 2025