BigTV English

Vinesh Phogat: అంత బిల్డప్ అవసరమా?.. వినేశ్ ఫోగట్ తీర్పుపై నిరసనల వెల్లువ

Vinesh Phogat: అంత బిల్డప్ అవసరమా?.. వినేశ్ ఫోగట్ తీర్పుపై నిరసనల వెల్లువ

Paris Olympics 2024, CAS Rejects Vinesh Phogat’s Appeal for Silver Medal: ఒలింపిక్ పోటీలు ముగిసినా.. ఆ వేడి ఇంకా తగ్గలేదు. వివాదాలు సమసిపోలేదు. వినేశ్ ఫోగట్ కి కాస్ కోర్టులో నిరాశే ఎదురైంది. అందరూ కలిసి ఆమెకు అన్యాయం చేశారని భారతదేశం భగ్గుమంది.
ఈ మాత్రం దానికి ఇన్నిరోజులు బిల్డప్ అవసరమా? అని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇచ్చేది లేదని ఒక్క ముక్క ఆరోజే చెబితే, అందరితోపాటు వినేశ్ ఫోగట్ కూడా ఇండియాకి వచ్చేసేది కదా.. అంటున్నారు.


వినేశ్ ఫోగాట్ విషయంలో తీవ్రంగా చర్చిస్తున్నట్టు బిల్డప్ లు ఇచ్చి, ఒక్క ముక్కలో సాస్ తన పిటీషన్ ని కొట్టి పారేసిందని దుయ్య బడుతున్నారు. ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఏకమైపోయాయని, అంతా కలిసి వినేశ్ కి అన్యాయం చేశారని అంటున్నారు. రెజ్లింగ్ లో చెత్త రూల్స్ అన్నీ పెట్టి, వాటిని సమర్థించుకోవడం క్షమించరానిదని మండిపడుతున్నారు. ఒలింపిక్స్ క్రీడలకే ఇది మాయని మచ్చ అంటున్నారు. అది మన భారతదేశ క్రీడాకారిణి విషయంలో జరగడం అత్యంత బాధాకరమని అంటున్నారు.

అయినా వినేశ్ ఫోగాట్ 53 కేజీల విభాగంలో ఉండేదని, తర్వాత తనని భారత రెజ్లింగ్ సమాఖ్య 50 కేజీలకు తీసుకొచ్చారని దుయ్య బడుతున్నారు. తను రెజ్లింగ్ సమస్యలపై పోరాడటం వల్లే, తనకిలా అన్యాయం చేశారని చెబుతున్నారు.  మరోవైపు భారత్ లో వినేశ్ ఫోగట్ కి మద్దతు దారుల సంఖ్య పెరిగిపోతోంది. వారిచ్చేదేమిటి? నువ్వే గెలిచావ్ అంటూ తనని సపోర్ట్ చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీ అయితే నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ కొనియాడారు.


Also Read: కాసేపు నవ్వుతూ.. పెళ్లిపై మనుబాకర్ క్లారిటీ, అనుకోకుండా జరిగిపోయింది

మరి భారత్ కి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ విషయంలో వినేశ్ ఫోగాట్ ఏమైనా పునరాలోచన చేస్తుందా? లేక ఇక్కడితో తన కెరీర్ కి ముగింపు చెప్పేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×