E-Paper
Advertisement

Mohsin Naqvi-Jay Shah: బ‌ద్ధ శ‌త్రువు న‌ఖ్వీతో పాక్ మ్యాచ్ చూడ‌నున్న జై షా.. దేశ ద్రోహి అంటూ ట్రోలింగ్ !

Mohsin Naqvi-Jay Shah: బ‌ద్ధ శ‌త్రువు న‌ఖ్వీతో పాక్ మ్యాచ్ చూడ‌నున్న జై షా.. దేశ ద్రోహి అంటూ ట్రోలింగ్ !
Advertisement

Mohsin Naqvi-Jay Shah: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. శివరాత్రి రోజున రేపు సాయంత్రం ఏడు గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan ) మధ్య మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇండియాకు బద్ధ శత్రువు అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీతో… కలిసి ఐసీసీ బాస్ జై షా మ్యాచ్ తిలకించబోతున్నారట. ఈ ఇద్దరు పక్క పక్కనే కుర్చీలు వేసుకొని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు రావడంతో ఇండియన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీతో ( Mohsin Naqvi) కూర్చోవడం కాదు.. మాట్లాడినా కూడా దేశద్రోహి ముద్ర వేస్తామని ఐసీసీ బాస్ జై షాను ( Jay Shah) హెచ్చరిస్తున్నారు ఇండియ‌న్ ఫ్యాన్స్‌.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

బ‌ద్ధ శ‌త్రువు న‌ఖ్వీతో పాక్ మ్యాచ్ చూడ‌నున్న జై షా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే నిర్వహిస్తున్నారు. ఇండియాతో సమస్యలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కోసం స్పెషల్ గా వేదికలు ఖరారు చేశారు. ఇక ఈ టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ శివరాత్రి రోజు రాత్రి 7 గంటలకు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ నుంచి నేరుగా కొలంబోకు చేరుకుంది టీమ్ ఇండియా. ఇలాంటి నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ బాస్ జై షా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొక్సిన్ నక్వి ఇద్దరూ కూడా కొలంబో చేరుకున్నారు. రేపు ప్రేమ దాస స్టేడియం వేదికగా జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఇద్దరు కలిసి చూసే ఛాన్స్ లు ఉన్నాయి. ఇద్దరికీ పక్క పక్కనే కుర్చీలు వేసి మరి, ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ పక్కన ఐసీసీ బాస్ జై షా కూర్చుంటే దారుణంగా ట్రోలింగ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అసలు మొహ్సీన్ న‌ఖ్వీ గాడిని దగ్గరకు కూడా రానివ్వకూడదని కోరుతున్నారు. మరి రేపు మ్యాచ్ సందర్భంగా ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×