E-Paper
Advertisement

Band Melam Glimpse: మగాడికి తాళి కట్టడం ఏంట్రా? ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌లో షాకింగ్ సీన్

Band Melam Glimpse: మగాడికి తాళి కట్టడం ఏంట్రా? ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌లో షాకింగ్ సీన్
Advertisement

Band Melam Glimpse: హర్ష్ రోషన్ – శ్రీదేవి జంటగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కోర్టు. 2025 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా రోషన్ (Roshan) శ్రీదేవి(Sridevi) జంటకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వీరిద్దరూ జంటగా’ బ్యాండ్ మేళం’ (Band Melam)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 13 వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

బ్యాండ్ మేళం గ్లింప్స్..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.1.12 నిడివితో విడుదల చేసిన ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇదొక ప్రేమ కథ సినిమాగానే స్పష్టమవుతుంది ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి వేదన అనుభవిస్తారో ఈ వీడియో ద్వారా చూయించారు. ఇక ఇందులో హీరో రోషన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టి చూసుకున్నానని తనని చూసిన ప్రతిసారి ఎక్కడ జారిపోతుందో అనే భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు. తను నా గుండెల్లో లేదంటూ ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

తాళి కట్టేది కలిసుండడం కోసమేనా?

Advertisement

ఇక చిన్నప్పటినుంచి తనకు తాళి కట్టాలని తనని సొంతం చేసుకోవాలని భావించిన రోషన్ కు సొంతం కాదని ఈ గ్లింప్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో రోషన్ ఒక డైలాగ్ చెబుతూ తాళి కట్టేది కలిసుండడానికే అయితే చిన్నప్పటినుంచి నాతో కలిసి ఉన్న నీకు తాళి కట్టాలి రా అంటూ తన స్నేహితుడికి తాళి కట్టడం ఈ వీడియోలో హైలెట్ గా, ఫన్నీగా నిలిచింది.. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. మగాడికి తాళి కట్టడం ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఇక ఈ వీడియో చూస్తుంటే ఒక లవ్ స్టోరీ సినిమాగానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మార్చి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా హిట్ సెంటిమెంటు రిపీట్ అవుతుందా అంటూ అభిమానులు భావిస్తున్నారు. నాని నిర్మాణంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్ సినిమా కూడా మార్చి 13వ తేదీ విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు బ్యాండ్ మేళం కూడా అదే తేదీన విడుదల కావటం విశేషం. ఇక ఈ సినిమాకు సతీష్ జివ్వాజి దర్శకత్వం వహించగా,కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ప్రఖ్యాత రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, కావ్య మరియు శ్రావ్య నిర్మిస్తున్నారు. మార్చి 13వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Chiranjeevi: అన్వీరా, శివ రామ్ పేర్లపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. గర్వంగా ఉందంటూ!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×