EPAPER

PM Modi consoles Vinesh: పారిస్ ఒలింపిక్స్, ఆసుపత్రి పాలైన వినేశ్, అనర్హతపై పీఎం మోదీ..

PM Modi consoles Vinesh: పారిస్ ఒలింపిక్స్, ఆసుపత్రి పాలైన వినేశ్, అనర్హతపై పీఎం మోదీ..

PM Modi consoles Vinesh Phogat(Sports news headlines): పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది భారతీయుల మనసును గాయపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ రియాక్ట్ అయ్యారు. వినేశ్ ఫొగాట్‌ను ఓదారుస్తూ ట్వీట్ చేశారు.


వినేశ్.. నీవు ఛాంపియన్లకే ఛాంపియన్.. నీ ప్రతిభ దేశానికి గర్వకాణమంటూనే.. భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇవాళ నీకు తగిన ఎదురుదెబ్బ ఎంతో బాధించిందని, దీనిపై వ్యక్తం చేయడానికి తన దగ్గర మాటలు లేవన్నారు. అయితే ఈ బాధ నుంచి బయటపడి తిరిగి రాగలవని తాను నమ్ము తున్నానని తెలిపారు. సవాళ్లను ఎదురించడం నీ నైజమని, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్రమోదీ.

మరోవైపు రెజ్లర్ వినేశ్‌ఫొగాట్ అనర్హత వ్యవహారంపై భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ వ్యవహారంపై వినేశ్‌కు సహాయం చేయడానికి ఇతర మార్గాలను అన్వేషించాలని కోరారు. దీనిపై నిరసన తెలియజేయడమేనని ఉత్తమమని చెప్పారు. అయితే నిరసన చేయాలని ఆమెకు ప్రధాని సూచన చేసినట్టు వార్తలు వస్తున్నాయి.


ALSO READ: పారిస్ ఒలింపిక్స్.. పతకం రాకుండా వినేశ్ ఫొగాట్‌పై కుట్ర, అనర్హత వేటు!

ఇదిలావుండగా భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్ర అస్వస్థతకు గురైంది. అధికారులు వెంటనే ఆమెని  ఆసు పత్రికి తరలించారు. రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేసింది. ఒలింపిక్ విలేజ్‌లో ఆమె రెస్ట్ తీసుకు న్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

బౌట్లు గెలిచిన వెంటనే ఆమె నేరుగా ప్రాక్టీసులో నిమగ్నమైంది. ఆహారం తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కేజీల బరువు అధికంగా ఉంది. రాత్రి చేసిన సాధనతో బరువు నియంత్రించుకున్నా.. కేవలం 100 గ్రాములు మాత్రమే తగ్గించుకోలేకపోయిందని తెలుస్తోంది.

 

Related News

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Bangladesh Team: ఒక్కరు తప్ప.. అంతా వస్తున్నారు!: బంగ్లా జట్టు ప్రకటన

India’s Paralympic Champions: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

Duleep Trophy 2024: సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్

Natasa Stankovic: సరిపోయారు.. ఇద్దరికిద్దరూ! బాయ్ ఫ్రెండ్ తో హార్దిక్ మాజీ భార్య నటాషా

Virat Kohli- Babar Azam: విరాట్ – బాబర్.. ఒకే జట్టులో గురుశిష్యులు ?

Duleep Trophy 2024: రింకూ, అయ్యర్, శాంసన్: ఈ ముగ్గురిలో చోటెవ్వరికి?

Big Stories

×