Train Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి ఫన్నీ సీన్స్, మరికొన్ని సార్లు హారర్ సీన్స్, ఇంకా స్టంట్స్, దొంగతనాలు, విన్యాసాలు వంటి చాలా రకాల వీడియోలు నెట్టింట తరచూ దర్శనమిస్తుంటాయి. అయితే కొన్ని సార్లు పలు వీడియోలు చూస్తే సాధారణమే అనిపించినా కూడా మరికొన్ని సార్లు కొన్ని ఘటనలు అసలు ఊహకు కూడా అందని మాదిరిగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి రా బాబు అని అనిపించేలా ప్రవర్తించారు ఓ ప్రేమికుల జంట.
రైలుపైకి ఎక్కేసి ప్రేమికుల విన్యాసాలు..
ప్రేమికులు సాధారణంగా పార్కులు, పబ్బులు, హోటల్స్ అంటూ విచ్చలవిడిగా చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ చాలా చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఘటన చూస్తే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా ప్రేమికుల జంట రైలుపై నడుచుకుంటూ దర్శనమిచ్చారు. ఇద్దరు ప్రేమికులు చేతులు పట్టుకుని ఓ ఆగిఉన్న రైలుపై నడుచుకుంటూ కనిపించారు. అసలు వీరు ఇలా ఎందుకు చేశారు అనే విషయం మాత్రం తెలిసిరాలేదు. రోడ్లపై స్థలం లేనట్లు ఇలా రైలు పై కప్పుపైకి ఎక్కి నడవచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ ‘ ప్లాట్ ఫాంపై నడవడానికి డబ్బులు లేవని రైలుపైకి ఎక్కి ఉచితంగా నడుస్తున్నారు’ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇలా విభిన్న రకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
वाह क्या प्यार है। https://t.co/xbAfQATM6I
— Adarsh Pandey (@AdarshPand67366) August 5, 2024