Rahul x Rahul: ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL} పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండే రాజస్థాన్ రాయల్స్.. ఈ సీజన్ IPL 2025 లో మాత్రం చతికిలబడింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానానికి పరిమితమైంది.
ఇక నేడు 32వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేడు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వీల్ చైర్ లో మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కే.ఎల్ రాహుల్ తో చాలాసేపు ముచ్చటించాడు.
ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆడిన ఇన్నింగ్స్ గురించి కేఎల్ రాహుల్ తో చర్చించాడు ద్రావిడ్. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ 93* పరుగులు చేసి ఢిల్లీ జట్టును గెలిపించాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ కి ఇది హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. దీనిపై కేఎన్ రాహుల్ తో ద్రావిడ్ మాట్లాడుతూ.. ” జట్టు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు గొప్పగా ఆడావు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించు.
ఒక ఆటగాడిగా మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడే ప్రశంసలు లభిస్తాయి. ఎటువంటి తప్పుకు ఆస్కారం లేకుండా నాణ్యమైన క్రికెట్ ఆడాలి” అని కేఎల్ రాహుల్ కి సూచించాడు రాహుల్ ద్రావిడ్. దీంతో వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. దీనికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ ని జోడించింది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని “కళావతి” పాటని ఆడ్ చేసింది. ఈ క్రమంలో మహేష్ బాబు పాటని భలే వాడుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
ఇక గతేడాది టి-20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత తన పదవీకాలం ముగియడంతో కోచ్ పదవి నుండి తప్పుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అనంతరం తనకు క్రికెటర్ గా పునర్జన్మ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా వెళ్లిపోయాడు. అయితే జట్టుకు శిక్షణ ఇస్తున్న సమయంలో.. బ్యాటింగ్ చేస్తూ ఉండగా రాహుల్ ద్రావిడ్ గాయపడ్డాడు. ఇప్పటికీ వీల్ చైర్ లోనే మైదానంలోకి వస్తున్నాడు. ఇలా వీల్ చైర్ లో మైదానంలోకి వచ్చి నేడు కేఎల్ రాహుల్ తో ముచ్చటించాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">