BigTV English

Employee Fired Early leaving: ఆఫీసు నుంచి నిమిషం ముందుగా వెళినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు.. కంపెనీపై కోర్టు ఆగ్రహం

Employee Fired Early leaving: ఆఫీసు నుంచి నిమిషం ముందుగా వెళినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు.. కంపెనీపై కోర్టు ఆగ్రహం

Employee Fired Early leaving| కార్పొరేట్ కంపెనీ తీరు రాను రాను విచిత్రంగా తయారవుతోంది. చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడి ఎక్కువగా ఉందని వాపోతున్నారు. భారతీయ బడా బిజినెస్ మెన్‌లు కూడా ఉద్యోగులు రోజుకు 12 గంటలు, 14 గంటలు పనిచేయాలి.. ఆదివారాలు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? అని వ్యాఖ్యలు చేస్తూ కొంచెం ఓవర్ చేస్తున్నారు. దీంతో కంపెనీలలో బాస్ ల తీరుతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. సరిగా పనిచేయకుండా ఉండే ఉద్యోగుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటే అందుకు అంగీకరించాల్సిందే.. కానీ మరీ టార్గెట్స్ పేరుతో ఎక్కువ పనిచేయించాలనే ధోరణి ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది.


ఒక యువతి తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ కంపెనీపై కేసు వేసింది. కోర్టు ఆమె కేసులో విచారణ చేసి కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే. చైనాలోని గువాంగ్ డాంగ్ రాష్ట్రం గువాంగ్ జౌ ప్రాంతానికి చెందిన మిస్ వాంగ్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఇంతకుముందు మంచి పనితీరు కనబర్చినందుకు ఆమె ఆఫీసులో ప్రశంసలందుకుంది కూడా. అయితే గత డిసెంబర్ లో కంపెనీ హెచ్ ఆర్ విభాగం నుంచి ఆమెకు ఒక నోటీసు అందింది. అందులో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉంది. అది చూసి వాంగ్ తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా తొలగించడం ఏంటని తన బాస్ ని ప్రశ్నించింది.

దానికి ఆయన చెప్పిన కారణం వింటే షాకవ్వాల్సిందే. ఆ కొత్త బాస్ చాలా స్ట్రిక్ట్. అందుకే ఆమె ఒకే నెలలో ఆరు సార్లు ఒక నిమిషం ముందు ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోయిందని.. అందుకే క్రమశిక్షణ చర్యగా ఆమెను తొలగిస్తున్నామని చెప్పాడు. ఇది విని మిస్ వాంగ్ తనకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఇలా ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని వాదించింది. అయినా సరే ఆ బాస్ కనికరం చూపలేదు.


Also Read: మతి స్థితిమితం లేని యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు.. 10 రోజులుగా కోమాలో..

ఆ తరువాత ఇంటికి వెళ్లిన మిస్ వాంగ్ తన సమస్యను తన ఫ్రెండ్ తో పంచుకుంది. ఆ అన్యాయం గురించి విన్న ఆమె స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. కంపెనీ అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని న్యాయం కోసం కోర్టు కెక్కింది. దీంతో కోర్టు ఈ కేసులో కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఒకవేళ సమయం కంటే ముందు ఆఫీసు నుంచి వెళ్లిపోతే ఆ ఉద్యోగులకు ఒకటి రెండు సార్లు హెచ్చరించాలని.. అప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే తొలగించాలని.. అంతేకానీ ఇలా ఒక్కసారిగా తొలగించడం తప్పు అని చెప్పింది. పైగా ఆ మహిళకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

ఆఫీసులో నిద్రపోయిన ఉద్యోగి

ఇంతకుముందు కూడా చైనాలో ఇంతకంటే విచిత్ర ఘటనే ఒకటి జరిగింది. ఆఫీసులో ఒక మేనేజర్ కాసేపు నిద్రపోయాడని చెప్పి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ మేనేజర్ చాలా సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో ఒకరోజు రాత్రంగా పనిచేసి మళ్లీ మరుసటి రోజు ఇంటికెళ్లి వచ్చాడు. అయితే పనిచేస్తూ నిద్రలేక కాసేపు కునుకు పెట్టాడు. ఈ దృశ్యం వీడియో ద్వారా కంపెనీ హెచ్ ఆర్ అధికారులు చూశారు. వెంటనే ఆ మేనేజర్ ని తొలగించారు.

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో షాకైన ఆ మేనేజర ఇది అన్యాయమని ప్రాధేయపడ్డాడు. కానీ లాభం లేకపోవడంతో కోర్టులో కంపెనీపై దావా వేశాడు. 20 సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేశానని.. పని ఎక్కువగా ఉండడంతో రాత్రంతా ఉన్నానని అందుకే మరుసటి రోజు నిద్రలేక కళ్లు మూసుకుపోయాయని కోర్టుకు తెలిపాడు. కోర్టు అతని వాదన విని కంపెనీ యజమాన్యం పై మండిపడింది. అతను కునుకుపెట్టడం వల్ల కంపెనీకి వచ్చిన నష్టం లేదని.. ఒక వేళ చర్యలు తీసుకోవాలంటే క్రమశిక్షణ చర్యల కింద ఫైన్ విధించడం లాంటిది చేయాలి.. అంతేకానీ సుదీర్ఘకాలం కంపెనీకి సేవలు అందించిన ఒక సీనియర్ ఉద్యోగిని ఇంత చిన్న కారణంగా తీసేయడం అమానవీయం అని పేర్కంటూ అతనికి రూ.42 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×