BigTV English

Ravichandran Ashwin: అశ్విన్ పై పేలుతున్న మీమ్స్..

Ravichandran Ashwin: అశ్విన్ పై పేలుతున్న మీమ్స్..
Ravichandran Ashwin

Memes On Ravichandran Ashwin (live sports news):


రాజ్ కోట్‌‌లో ఇంగ్లాండ్‌తో  జరుగుతున్న మూడో టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్ క్రాలే వికెట్ తీసుకుని 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అంతర్జాతీయంగా చూస్తే 500 వికెట్లు తీసిన వారిలో తొమ్మిదోవాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఒకరకంగా చెప్పాలంటే టాప్ 10లో ఉన్నట్టే లెక్క.

ఈ నేపథ్యంలో నెట్టింట అశ్విన్‌పై మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. 500 వికెట్లు కాబట్టి, ఏకంగా 500 రూపాయల నోట్ మీద అశ్విన్ బొమ్మ వేసి తన ఆనందాన్ని తీర్చుకున్నారు. మరొకరు మన తెలుగువాడనుకుంటా.. హీరో బాలయ్య ఒక సినిమాలో లుంగీ పంచె కట్టి రోడ్డు మీద, ఒక కిలోమీటర్ రాయిపై కాలు పెట్టి నిలుచున్న ఫొటోని మార్ఫింగ్ చేశారు. బాలయ్య ఫేస్ తీసి అశ్విన్ ఫొటో పెట్టి, దర్జాగా నిలుచున్నట్టు చూపించారు.


Read More: మూడోరోజు ఆటకు దూరమైన.. అశ్విన్..!

ఇలా ఒకటి కాదు, నెట్టింట జనాలు ఎలా తయారయ్యారంటే ఆనందం వస్తే తట్టుకోలేకపోతున్నారు. బాధ వస్తే కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో చూస్తే క్రికెటర్లను వారి ఆట వారిని ఆడుకోనివ్వడం లేదు. ముందు వారు గ్రౌండ్ లోకన్నా మొబైల్ ఫోన్ చూస్తే చాలు, వారి జీవితం మఠాషే అన్నట్టే ఉంది. ఇదే అశ్విన్‌పై గతంలో పలు విమర్శలు వచ్చాయి. ఇప్పుడిలా మొదలెట్టారు.

కొందరంటున్నారు.. నెట్టింట అభిమానులు అమాయకులు. క్రికెట్‌పై వారికి నిస్వార్థమైన ప్రేమ ఉంది. మనవాళ్లు బాగా ఆడాలని కోరుకుంటారు. అందులో తప్పేం ఉంది. ఇండియా గెలిచిందంటే చాలు, తామే గెలిచినంత సంబర పడతారు. అందుకని తప్పదు పాజిటివిటీని భరించినప్పుడు, నెగిటివిటిని తట్టుకోవడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుత క్రికెట్‌లో వీటన్నింటిపై కూడా మనవాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండాలని మరికొందరు రాసుకొచ్చారు. మొత్తానికి 500 వికెట్లు తీయడం కాదుగానీ, నెట్టింట సోషల్ మీడియాలో మంచి డిబేట్లు నడుస్తున్నాయి. ప్రసుతానికైతే నేటి హీరో అశ్విన్ అనే చెప్పాలి.

Tags

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×