BigTV English

Ravichandran Ashwin: మూడోరోజు ఆటకు దూరమైన.. అశ్విన్..!

Ravichandran Ashwin: మూడోరోజు ఆటకు దూరమైన.. అశ్విన్..!
Ravichandran Ashwin latest news

Ravichandran Ashwin Withdraws From 3rd Test(Sports news today): తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని పెద్దలంటారు. నిన్నటి వరకు రవిచంద్రన్ అశ్విన్ జీవితంలో అద్భుతమైన ఆనందం ఉరకలు వేసింది. అంతలోనే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఆనందం స్థానంలో విచారం మొదలైంది.


అశ్విన్ తల్లిగారిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చడంతో తను అత్యవసరంగా చెన్నై వెళ్లాల్సి వచ్చింది. బీసీసీఐ కూడా వెంటనే అనుమతిచ్చింది. జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అశ్విన్‌కు మేము సంపూర్ణ మద్దతిస్తున్నాం, అలాగే తనకెటువంటి సహాయ సహకారాలు కావాలన్నా బీసీసీఐ నుంచి అందిస్తామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

Read More: మూడో టెస్ట్‌లో మెరుపులు-మరకలు..


టీమ్ ఇండియా కూడా స్పందించింది. అశ్విన్‌కు ఎల్లవేళలా తమ సహాయసహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. మెడికల్ ఎమర్జన్సీగా భావించి బీసీసీఐ తనని అర్జంటుగా పంపించింది. అలాగే సోషల్ మీడియాను కూడా రిక్వెస్ట్ చేసింది. దయచేసి అశ్విన్ కుటుంబ విషయంలో గోప్యత పాటించమని కోరింది.

లేనిపోని వార్తలు, తెలిసీతెలియని వార్తలు స్రష్టించి ప్రజలని, క్రికెట్ అభిమానులని గందరగోళంలోకి నెట్టవద్దని కోరింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకెంతో ముఖ్యమని తెలిపింది. అంతేకాదు  అశ్విన్ తల్లిగారు త్వరగా కోలుకోవాలని బీసీసీఐ ఆకాంక్షించింది.

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు అశ్విన్ వెళ్లిపోవడంతో జట్టుపై పెను భారం పడినట్టయ్యింది.

ఇక ఫుల్ టైం బౌలర్లు నలుగురే ఉన్నారు. ప్రస్తుతానికి అశ్విన్ తొలి వికెట్ తీసుకున్నాడు. అలాంటిది రెండో టెస్ట్‌లో తనే ప్రభావం చూపిస్తాడనుకుంటే ఇలా జరిగింది. మరి రోహిత్ శర్మ టీమ్ ఇండియా బ్యాటర్లతో బౌలింగ్ చేయిస్తాడా? లేక తనే చేస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Big Stories

×