BigTV English

RCB Fan: నీ దుంప తెగ.. నిజంగానే గొర్రెలు కోసి దావత్ ఇచ్చావ్ కదరా

RCB Fan: నీ దుంప తెగ.. నిజంగానే గొర్రెలు కోసి దావత్ ఇచ్చావ్ కదరా

RCB Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. మొన్న మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన చారిత్రాత్మక విజయం సాధించి 18వ సీజన్ లో మొట్టమొదటి టైటిల్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇక 18వ సీజన్ లో మొట్టమొదటి టైటిల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. రోడ్లపైకి వచ్చి రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఓ బుడ్డోడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ

గొర్రెలు కోసి దావత్ ఇచ్చిన బుడ్డోడు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలవడంతో.. ఓ కుర్రాడు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఛాంపియన్ అయితే కచ్చితంగా గొర్రెలు కోసి దావత్ ఇస్తానని.. ముందుగా చెప్పినట్లే… చేసి చూపించాడు ఈ కుర్రాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ తెలుగు కుర్రాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని తెలుస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభ సమయంలో… బెంగళూరు చాంపియన్ అయితే తన గొర్రెలు కోసి దావత్ ఇస్తానని ఈ బుడ్డోడు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పెట్టి మరి ప్రకటించేశాడు. అప్పుడు ఆ బుడ్డోడు వీడియో వైరల్ కావడంతో దారుణంగా ట్రోల్లింగ్ చేశారు. ఒరేయ్ బుడ్డోడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జన్మలో కూడా టైటిల్ గెలవదని దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆ కుర్రాడి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు కొంతమంది విరాట్ కోహ్లీ నెగిటివ్ ఫ్యాన్స్. కానీ ఆ కుర్రాడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అనంత పని చేసి చూపించాడు.

మంగళవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో…. ఒక గొర్రె కోసి… దావత్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన తోటి మిత్రులు అలాగే ఊర్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి… దావత్ ఇచ్చేశాడు. ఓ గొర్రెను కోసి వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశాడు ఆ కుర్రాడు. ఫ్రెండ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయింది.. ముందుగా చెప్పినట్లుగానే ఇప్పుడు దావత్ ఇస్తున్న అంటూ ఈ వీడియోలో స్పష్టం చేశాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి కొంతమంది ఆర్ సి బి అంటే పడని వాళ్ళు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ డిన్నర్ అని చెప్పి…మధ్యాహ్నం లో లంచ్ పెడుతున్నావు ఏంట్రా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. మరికొంతమంది బెంగళూరు అభిమానులు అయితే ఆ కుర్రాడిని మెచ్చుకుంటున్నారు.

ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే

 

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×