RCB Maiden IPL Trophy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన… ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా గెలిచి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది RCB. రెండు జట్లు కూడా చివరి వరకు ఆచి తూచి ఆడాయి. కానీ చివరకు… మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఫైనల్ మ్యాచ్ కేవలం 6 పరుగులు తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్.. చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. 30 పంతులు 61 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్… ఓడిపోయింది. 191 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ కింగ్స్. దీంతో.. ఛాంపియన్ గా RCB నిలిచింది.
Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ
తేలిపోయిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారని చెప్పవచ్చు. గత మ్యాచ్లలో… ఫాస్ట్ గా ఆడిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు… ఫైనల్ మ్యాచ్ అనేసరికి కాస్త ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ప్రియాంష్ ఆర్య 24 పరుగులు చేయగా, ప్రభు సిమ్రాన్ సింగ్ 22 బంతులు ఆడి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. అటు సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ ఒకే ఒక్క పరుగు చేసి దారుణంగా విఫలమయ్యాడు. అటు ఇంగ్లాండ్ ఆటగాడు జోష్ ఇంగ్లీష్ మరోసారి రాణించే ప్రయత్నం చేయగా… అతనికి మంచి సపోర్ట్ దొరకలేదు. శశాంక్ సింగ్ ఒంటరి పోరాటం మాత్రం అందరిని ఆకట్టుకుంది.
అదరగొట్టిన బెంగళూరు బ్యాటర్లు
ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు పెద్ద ఇన్నింగ్స్ లో ఆడకపోయినా… చివరి వరకు ఆడి 190 పరుగులు అయితే చేయగలిగారు. పంజాబ్ బౌలర్లు చాలా కఠినంగా బౌలింగ్ వేసినప్పటికీ… నిర్ణీత 20 ఓవర్స్ లో… తొమ్మిది వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది రాయల్ చాలెంజెస్ బెంగళూరు. ఇందులో విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 122 స్ట్రైక్ రేటుతో మూడు బౌండరీలు సాధించాడు. అలాగే మయాంక్ అగర్వాల్ 24 పరుగులు చేయగా… పిల్ సాల్ట్ 16 పరుగులకు అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ 26 పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ 25 పరుగులు చేయగా జితేష్ శర్మ 24 పరుగులు చేసి రాణించాడు.
ఐపీఎల్ 2025 ప్రైజ్ మనీ ఎంత అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో విజేతకు ప్రైజ్ మనీ భారీగా దక్కనుంది. ఏకంగా 20 కోట్లు… గెలిచిన జట్టుకు దక్కనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు 12.5 కోట్లు దక్కించుకోనుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే… ఐపీఎల్ ప్రైజ్ మనీ 20 కోట్లు అయితే… రిషబ్ పంత్ ఐపీఎల్ ప్రైజ్ 27 కోట్లు కావడం గమనార్హం.