Anushka Shetty:అనుష్క శెట్టి (Anushka Shetty).. ‘సూపర్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, తన నటనతో అబ్బురపరిచింది. అంతేకాదు ‘బిల్లా’ వంటి సినిమాలలో ఒక్కసారిగా తన అందాలు ఆరబోసి చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. అటు కమర్షియల్ చిత్రాలతో పాటు ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్న అనుష్క ‘బాహుబలి’ సినిమా తర్వాత సినిమాలు దాదాపుగా తగ్గించిందని చెప్పాలి. గతంలో ‘మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)దర్శకత్వం వహిస్తున్నారు.
వేదం సినిమాకి 15 ఏళ్లు..
ఇదిలా ఉండగా అనుష్క కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలలో ‘వేదం’ కూడా ఒకటి. ఇందులో తొలిసారి వేశ్య పాత్ర వేసి అందరిని తన నటనతో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 15 సంవత్సరాలు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్టును పంచుకున్నారు.. అప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం అనుష్క గెటప్. వేదం సినిమా నుంచి అనుష్క ఎల్లో కలర్ చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని అప్పుడు డైరెక్టర్ ప్రమోషన్స్లో బాగా వాడారు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా కూడా పెట్టారు.
అనుష్క దెబ్బకి 40 యాక్సిడెంట్లు..
ఇక ఆ హోర్డింగ్ లో అనుష్క ని చూస్తూ వాహనదారులు దాదాపుగా యాక్సిడెంట్ కి గురయ్యారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 యాక్సిడెంట్లు జరిగాయట. పెద్ద యాక్సిడెంట్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేశారట అనుష్క లుక్కు పోస్టర్ అందరిని మెస్మరైజ్ చేసింది. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రెగ్యులర్గా జరిగే ఆక్సిడెంట్లను గమనించిన పోలీసులు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ను కూడా తొలగించారట. అలా అనుష్క తన అందంతో అందరిని చూపు తిప్పుకకోనివ్వకుండా చేసింది. మొత్తానికైతే ఈ పోస్టర్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .
వేదం సినిమా విశేషాలు..
వేదం సినిమా విషయానికి వస్తే.. మెలో డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్ (Manchu Manoj), అనుష్క శెట్టి(Anushka Shetty), శరణ్య(Saranya ), నాగయ్య (Nagayya), దీక్ష సేథ్ (Deeksha Seth), లేఖ వాషింగ్టన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జ్ఞాన శేఖర్ విmఎస్ సినిమాటోగ్రఫీ గా పని చేయగా.. ఎం.ఎం.కీరవాణి(MM Keeravani)సంగీతాన్ని అందించారు. 2010 జూన్ 4న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ALSO READ:Sitara Ghattamaneni: వామ్మో.. సితారాలో ఈ టాలెంట్ కూడా ఉందా?