BigTV English

Weightloss with Music: బరువు తగ్గాలా? అయితే రోజూ మ్యూజిక్ వినండి, జపాన్ పరిశోధనలో ఏం తేలిందంటే

Weightloss with Music: బరువు తగ్గాలా? అయితే రోజూ మ్యూజిక్ వినండి, జపాన్ పరిశోధనలో ఏం తేలిందంటే

బరువు తగ్గాలని ప్రయత్నించే వారంతా మొదటి చేసే పని ఆహారాన్ని కంట్రోల్ చేయడం. అలాగే జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేస్తారు. జిమ్ కు వెళ్లే స్తోమత లేకపోతే కనీసం వాకింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. వ్యాయామాలు, ఆహారాలు మాత్రమే కాదు మనం వినే శబ్దాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం తెలిపింది. మీరు ప్రతిరోజు వ్యాయామం చేసినట్టే మ్యూజిక్ వినడం ద్వారా కూడా బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.


కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్ లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం శబ్దంలోని ధ్వని తరంగాలు సెల్యులర్ ప్రవర్తనను మారుస్తాయని… అవి శరీరంలో కొవ్వు కణాల పెరుగుదలను ఆపడానికి ఉపయోగపడతాయని తెలుస్తోంది. జపాన్ పరిశోధకులు ఈ విషయాన్ని కొత్తగా కనిపెట్టారు.

ధ్వని ఎలా ప్రయాణిస్తుంది?
ధ్వని అనేది గాలి, నీరు లేదా ఏదైనా కణజాలం వంటి పదార్థాల ద్వారా ప్రయాణం చేసే యాంత్రిక తరంగాలతో రూపొందుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకల కండర కణాలపై మూడు రకాల శబ్దాలను ప్రవేశపెట్టి పరీక్షించారు. అది పియానో లోని A నోట్, అలాగే అధిక పిచ్ తో ఉండే పాటలు, తెల్లని శబ్దం. తెల్లని శబ్దం అంటే ఇది మానవ వీరికి వినికిడి పరిధిలోనే ఉంటుంది. అన్ని పౌన:పుణ్యాలను ఇది కలిగి ఉన్న ధ్వని. ప్రతి పౌనఃపున్యం వద్ద సమాన తీవ్రత ఉంటుంది. అందుకే దీన్ని వైట్ సౌండ్ అని ఇంగ్లీషులో పిలుస్తారుజ.


అధ్యయనం ఇలా
ఇలా మూడు రకాల ధ్వని శబ్దాలను ఎలుకల కండరాలపై ప్రవేశపెట్టారు. ఇలా ప్రవేశపెట్టిన రెండు గంటల తర్వాత ఎలుకలలో మార్పులను గమనించారు. వాటిలో 42 జన్యువులు మారడంతో పరీక్ష ఫలితాలు ఆశ్చర్యకరమైన ఫలితాన్ని అందించాయి. 24 గంటల తర్వాత అదే ఎలుకల్లో 145 జన్యువులు మార్పు చెందినట్టు గుర్తించారు.

ఈ ఫలితాలన్నింటినీ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ విశ్లేషణలో ధ్వని తరంగాలు అడిపోసైట్లలో ఎంతో ప్రభావాన్ని చూపించాయి. వీటిలో కొవ్వును నిల్వ చేసే ప్రీఆడిపో సైట్లు పరిణతి చెందిన కొవ్వు కణాలుగా మారాయి. పరిమితి చెందిన కొవ్వు కణాలలో తక్కువ కొవ్వు నిల్వ ఉంటుంది. శరీరంలోని కణాలు స్పందించే విధానం, ధ్వని తరంగం నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ తీవ్రత, నమూనాలపై ఆధారపడి ఉంటుంది. అయితే శరీరంలోని కణ రకాన్ని బట్టి కూడా ప్రతిస్పందన మారుతూ ఉంటుంది.

పైన చెప్పిన విశ్లేషణ ప్రకారం శబ్ద తరంగాల వల్ల కొవ్వు కణాలలో కొవ్వు తక్కువగా పేరుకుపోతున్నట్టు గుర్తించారు. శాస్త్రవేత్తలు సాధారణం కన్నా తక్కువ పేరుకుపోవడం అనేది మంచి విషయమే. దీన్నిబట్టి ధ్వని తరంగాలు కొవ్వును అధికంగా నిలవ చేయకుండా అడ్డుకుంటున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది.

ఇప్పటికే ధ్వని తరంగాలను చికిత్సలో భాగం చేశారు. కొన్ని రకాల సమస్యలకు చికిత్స చేసేందుకు శబ్దాలను ఉపయోగిస్తున్నారు. రక్తప్రసరణను శరీరంలో పెంచడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి కూడా అకోస్టిక్ వేవ్ థెరపీని ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా శరీరంలో దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నా, అలాగే మగవారిలో అంగస్తంభన లోపం వంటి సమస్యలు ఉన్నా, మృదు కణజాలాలకు గాయాలు తగిలినా కూడా ఈ ఎకౌస్టిక్ వేవ్ థెరిపీని ఉపయోగించి చికిత్స అందిస్తున్నారు. భవిష్యత్తులో ధ్వని తరంగాలతో చికిత్స చేసే విధానం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×