Anushka Sharma-Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తొలిసారి టైటిల్ ఎగరేసుకు వెళ్లింది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలవగానే… ఎగిరి గంతేశాడు విరాట్ కోహ్లీ. గ్రౌండ్ చుట్టూ తిరిగి సంబరాలు చేసుకున్నాడు. శశాంక్ సింగ్ బ్యాటింగ్ పూర్తికాగానే.. గ్రౌండ్ లోనే కుప్పకూలి కాస్త కన్నీళ్లు పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్లతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
అనుష్క శర్మకు హగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
టైటిల్ గెలవగానే విరాట్ కోహ్లీ… సంబరాలు అంతా కాదు. బెంగళూరు ఆటగాళ్లతో ఎంజాయ్ చేస్తూనే తన భార్య వద్దకు వెళ్లి… ఎమోషనల్ అయ్యారు విరాట్ కోహ్లీ. అక్కడే ఉన్న తన భార్య అనుష్క శర్మ కు టైట్ హగ్ ఇచ్చి… విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య భర్తలు ఇద్దరూ ఆనందభాష్పాలను రాల్చారు. అనంతరం తన భార్యను పట్టుకొని… గ్రౌండ్ లోకి వచ్చి మరి సంబరాలు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… టైటిల్ నెగ్గడంతో… విరాట్ కోహ్లీ ఇంతలా భావోద్వేగానికి గురికావాల్సి వచ్చింది.
ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ కు వెళ్లి ఓడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఈసారి మాత్రం చివరి వరకు పోరాడి విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీమిండియా… ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన తరహాలోనే… ఐపీఎల్ టోర్నమెంట్ను రాయల్ చాలెంజెస్ బెంగళూరు గెలవడంతో సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చివరి వరకు పోరాడిన శశాంక్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన కేవలం ఆరు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన రాయి చాలెంజెస్ బెంగళూరు జట్టు నిర్నిత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ కింగ్స్. దీంతో ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ వీరోచిత పోరాటం చేశాడు. చివరి వరకు నిలిచిన శశాంక్ సింగ్ 30 బంతులు 61 పరుగులు చేసి దుమ్ము లేపాడు. కానీ అతనికి సపోర్ట్ గా ఎవరు నిలవకపోవడంతో మ్యాచ్ ఓడిపోవలసి వచ్చింది.
VIRAT kohli & Anushka Sharma pic.twitter.com/yFlesKYR4j
— Devilal Bangra (@devilalbangra3) June 3, 2025