E-Paper
Advertisement

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం
Advertisement

Basit Ali On Rift Babar Azam and Shaheen Afridi: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టుల్లో కూడా పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమి చవి చూసింది. బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్ గా కొనసాగిన రెండో టెస్ట్ కూడా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ ఆజం చేతకాని దద్దమ్మ అంటూ కొంతమంది విమర్శిస్తుంటే… మరి కొంత మంది మాత్రం అతడికి సరైన ప్లేయర్లను అందించడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విఫలమైందని కామెంట్ చేస్తున్నారు.

బాబ‌ర్, షాహీన్ మ‌ధ్య గొడ‌వ‌లు..రెండుగా చీలిన పాకిస్తాన్

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన క్రమంలో ఇటీవల గుండెపోటుకు గురైన బాసిత్ అలీ (BASIT ALI ) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య ఉన్న గొడవలే అంటూ బాంబు పేల్చారు. ఇద్దరు దుర్మార్గులు.. గొడవ పెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ జట్టును సంక నాకిస్తున్నారని సీరియస్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు రెండు ముక్కలుగా విడిపోయిందని ఆరోపణలు చేశారు. బాబర్ ఆజం గ్రూపులో కొంత మంది ప్లేయర్లు ఉంటే.. షాహిన్ అఫ్రిది గ్రూపులో మరికొంతమంది కీలక ప్లేయర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న జట్టులో కూడా షాహీన్ అఫ్రిది గ్రూప్ న‌కు సంబంధించిన ప్లేయర్స్ కూడా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ టెస్ట్ జట్టును షాహీన్ అఫ్రిది గ్యాంగ్ కావాలని ఓడించిందని ఆరోపణలు చేశారు. కలిసికట్టుగా కుట్ర చేసి మరి రెండో టెస్టులో బాబర్ ఆజం సేనను ఓడించినట్లు వ్యాఖ్యానించారు. వెంటనే బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య ఉన్న గొడవను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద మనిషి చేసుకొని జోక్యం చేసుకోవాలని కోరారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టును సర్వనాశనం చేసి తీరుతారని హెచ్చరించారు. బాబర్ ఆజంకు టెస్ట్ కెప్టెన్ గా పర్మనెంట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.

Advertisement

వన్డేలకు షాహీన్ అఫ్రిది బెటర్ ఆప్షన్ అని వివరించారు. ఇక టి20లకు మాత్రం కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే బెటరని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్…2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ లో కూడా పాకిస్తాన్ ను ఓడించి వైట్ వాష్‌ చేయాలన్న కసితో ముందుకు దూసుకు వెళ్తోంది ఇంగ్లాండ్.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×