E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..రంగంలోకి లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు

షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..రంగంలోకి లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు
Advertisement

Terrorists  attended Akhtar’s brother funeral:
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి బంతి 150కి పైగా స్పీడ్ తో వేస్తూ, అప్పట్లో బ్యాటర్లను ముప్ప తిప్పలు పెట్టాడు షోయబ్ అక్తర్. అలాంటి షోయబ్ అక్తర్ ప్రస్తుతం రిటర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. టీవీ చానల్స్ లో జరిగే డిబేట్స్ లో కూడా కనిపిస్తున్నాడు. అయితే అలాంటి షోయబ్ అక్తర్ ఇంట‌ తాజాగా విషాదం నెలకొంది. షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ (Shahid Akhtar) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న షాహిద్, రెండు రోజుల కిందట గుండెపోటుతో మరణించారు.

Also Read:  Silver Siegers Missed Run out Tazmin Brits: ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

Advertisement

దీంతో షోయబ్ అక్తర్ ఇంట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. తన సోదరుడు మరణించాడని స్వయంగా షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి, ఎమోషనల్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ (Shahid Akhtar’s funeral) అంతక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా టెర్రరిస్టులు (Lashkar-e-Taiba terrorists).. ఈ అంత్య‌క్రియ కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..రంగంలోకి ఉగ్ర‌వాదులు

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ తాజాగా గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో నిన్న షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ అంత్యక్రియలలో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఏ మాత్రం భయం లేకుండా.. బహిరంగం గానే ఈ ఉగ్రవాదులు, అంత్యక్రియలకు హాజరు కావడం ఇప్పుడు వివాదంగా మారింది. ఇస్లామాబాద్ లోని హెచ్ 8 స్మశాన వాటికలో షాహిద్ అక్త‌ర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు… అంతర్జాతీయంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రతినిధులు కూడా హాజరు కావడం హాట్ టాపిక్ అయింది.

Advertisement

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా పనిచేస్తున్న పాకిస్తాన్ మర్కాజి ముస్లిం లీగ్ పార్టీ అధినేత ఇనాన్ కూడా హాజరయ్యారు. దీనిపై ఇండియన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూనే, ఇలా బహిరంగంగా ఉగ్రవాదులు తిరుగుతుంటే, అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడుతున్నారు. ఇండియా పై దాడులకు ఉగ్రవాదులను ప్రేరేపించేది పాకిస్థాన్ ప్రభుత్వమే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్ దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్స్. నీతులు చెప్పే షోయ‌బ్ అక్త‌ర్ దీనిపై స్పందించాల‌ని ఫైర్ అవుతున్నారు.

Also Read: PAT CUMMINS, TRAVIS HEAD TO MISS IPL 2027: అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

 

Related News

కెప్టెన్సీ చేత‌కాక‌పోతే, త‌ప్పుకుని ఇంట్లో కూర్చో..శ్రేయ‌స్ పై సెహ్వాగ్ సీరియ‌స్

అస‌లైన‌ ప్లేయ‌ర్లు ఐదుగురు ఆడింటే, 100లోపే టీమిండియా ఆలౌట్ అయ్యేది

త‌ప్పుల త‌డ‌క‌గా స్కోర్ బోర్డు, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ క్యాన్సిల్

ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా..ఈ ఇద్ద‌రే కొంప‌ముంచారు

అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

Michael Vaughan: గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా? వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు

వైభ‌వ్ పై గంభీర్ పాలిటిక్స్ షురూ… 15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?

Big Stories

×