IND VS IRE: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ సిరీస్ ప్రారంభం కాగా, మొదటి మ్యాచ్ లోనే టీమిండియా దారుణంగా ఓడిపోయింది. పసికూన ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. మొన్ననే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup ) గెలిచిన టీమిండియాను, ఐర్లాండ్ C టీమ్ ఓడించింది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. సూర్య భాయ్ (suryakumar yadav) కెప్టెన్ గా ఉండి ఉంటే, టీమిండియా ఇవాళ తలదించుకునే పరిస్థితి ఉండకపోయదని అంటున్నారు. అంతేకాదు మంచు విష్ణు (Manchu Vishnu ).. గతంలో జరిగిన మా ఎన్నికల సందర్భంగా వేసిన డైలాగ్ కూడా వైరల్ చేస్తున్నారు. మా సూర్య అంకుల్ ఉండి ఉంటే, ఐర్లాండ్ పని చెప్పేవాళ్ళని… మంచు విష్ణు చెప్పిన డైలాగ్ ను సూర్య కుమార్ యాదవ్ కు అనుకూలంగా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు వీడియో వైరల్ గా మారింది.
టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య టి20 సిరీస్ జరిగిన నేపథ్యంలో మంచు విష్ణు డైలాగులు వాడేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. నిన్నటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ఉండి ఉంటే టీమిండియా గెలిచేదని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీహరి అంకుల్ గారు అంటూ మంచు విష్ణు చెప్పిన డైలాగును… మార్చి సూర్య కుమార్ యాదవ్ కు అనుకూలంగా వైరల్ చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఉండి ఉంటే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయేది కాదంటూ స్పష్టం చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టి20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కూడా గెలిపించాడు సూర్య భాయ్.
అలాంటి సూర్యను పక్కకు పెట్టడంపై మొన్నటి వరకు బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం.. సూర్య అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికైనా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… 2024 టీ 20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కూడా ఇలాంటి అవమానమే ఎదురైంది. జింబాబ్వే చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఇక మొన్న 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ లెక్కన 2028 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా గెలవడం ఖాయమని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==