Virender Sehwag Angry On Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో టీమిండియా శుక్రవారం తొలి టి20 ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో ఏకంగా 34 పరుగులు తేడాతో వరల్డ్ కప్ విజేత టీమిండియా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. టీమిండియాను కించపరుస్తూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇక పాకిస్తాన్ వెధవలైతే బరితెగించి మాట్లాడుతున్నారు. పసికూన చేతిలో ఓడిపోయిందని ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) కూడా స్పందించారు. టీమిండియా వైఫల్యాలను బయటపెట్టారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఏకీ పారేస్తూ, మండిపడ్డారు. కెప్టెన్సీ చేతకాకపోతే, ఆ పదవి నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చో అంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియడం లేదా? అసలు కెప్టెన్సీ కి నువ్వు పనికిరావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీరేంద్ర సెహ్వాగ్.
ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయాలే కొంపముంచాయని మండిపడ్డారు. అతని విధానం ఏమాత్రం తనకు నచ్చలేదని సీరియస్ అయ్యారు. ముఖ్యంగా 15వ ఓవర్ వాషింగ్టన్ సుందర్ కు ఇచ్చి, శ్రేయస్ అయ్యర్ పెద్ద తప్పు చేశాడని ఫైర్ అయ్యారు. ఐర్లాండ్ ఆటగాళ్లు ఇద్దరు సెటిలై ఉన్న క్రమంలో, 15వ ఓవర్ వాషింగ్టన్ సుందర్ కు ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో ఒకే ఓవర్ లో 19 పరుగులు సమర్పించుకున్నాడు సుందర్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 19 పరుగులు రాకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి వేరే లాగా ఉండేదని పేర్కొన్నారు. బౌలర్లను వినియోగించుకోవడంలో విఫలమయ్యాడని శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు.
ఐర్లాండ్ తో జరిగిన తొలి t20 సందర్భంగా బ్యాటర్లు కూడా విఫలమయ్యారని వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ మినహా ఏ ఒక్కరు ఆడలేదని మండిపడ్డారు. అసలు ఇప్పటివరకు టీమిండియా కు మంచి ఫినిషర్ లేడని… ధోని వెళ్లిన తర్వాత, ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోతున్నారని చురకలు అంటించారు. దానిపైన సెలెక్టర్స్ ఫోకస్ చేయాలని కోరారు. క్రికెట్ అంటే ప్రతి బంతికి సిక్సర్లు కొట్టడం కాదని… పిచ్ పరిస్థితులు చూసుకొని.. మ్యాచ్ ను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఇక ముందు ముందు ఇలాంటి ప్రదర్శన కనబరిస్తే… టీమిండియా కు ఘోరమైన ఓటములు తప్పవని హెచ్చరించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.