IND VS IRE: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య నిన్న టి20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన ఈ టి20 సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన ఐర్లాండ్, టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఇక ఈ రెండు జడ్ల మధ్య రేపు అంటే ఆదివారం జూన్ 28వ తేదీన రెండో టి20 జరగనుంది. మొదటి మ్యాచ్ సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, బెల్‌ఫాస్ట్ ( Civil Service Cricket Club, Belfast) వేదికగా జరగగా.. రెండో మ్యాచ్ కూడా ఇదే వేదికగా నిర్వహించబోతున్నారు. అయితే రెండో టి20 నేపథ్యంలో టీమిండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రేపటి మ్యాచ్ కు వర్షం ( Rain Effect) అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రేపటి రెండో టి20 రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే, ఐర్లాండ్ చేతిలో టి20 సిరీస్ టీమ్ ఇండియా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చిట్టచివరి టీ20 జూన్ 28 అంటే ఆదివారం జరగనుంది. నిన్న టీమిండియా మొదటి మ్యాచ్ లో ఓడిపోగా.. శనివారం మొత్తం ప్రాక్టీస్ చేసేందుకు ప్లేయర్ లందరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బెల్ ఫాస్ట్ లో బ్యాడ్ వెదర్, భారీ వర్షం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇవాళ టీమిండియా క్రికెటర్లు ఎవరూ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఇక ఆదివారం రోజున మ్యాచ్ కు కచ్చితంగా వర్షం విలన్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం రోజున బెల్ ఫాస్ట్ లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారీ వర్షం పడితే మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు 1-0 తేడాతో టి20 సిరీస్ ను ఐర్లాండ్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వరుణ దేవుడు సహకరించాలని.. ఆదివారం ఒక్కరోజు వర్షం పడకుండా ఉండాలని మొక్కుతున్నారు. వర్షం పడకుండా యధావిధిగా మ్యాచ్ జరిగితే, మొదటి మ్యాచ్ లో ఓడిన కసితో కచ్చితంగా ఆదివారం గెలుస్తారని అంటున్నారు. అలా జరిగితే, 1-1 తేడాతో సిరీస్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు టీమిండియా పరువు పోకుండా ఉంటుంది. మరి ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి.