Watch Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు.
Also Read : Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !
బ్యాటర్ మూతికి బంతి విసిరిన బుడ్డోడు
తాజాగా ఇక్కడ ఒక బుడ్డోడు స్పీడ్ ఉరికి ఉరికి బ్యాటర్ ముందుకు వచ్చి మూతికి బంతి విసిరాడు. దీంతో బ్యాటర్ చేస్తున్న మరో బుడ్డోడి మూతి పగిలిపోయింది. పాపం క్రికెట్ ఇలా కూడా ఆడుతార్రా.. అంటూ ఈ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు. చూడటానికి చాలా చిన్నోడు అయినా తింగిరి చేతలు మాత్రం మామూలుగా లేవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. పెద్దయ్యాక ఇంకెలా తయారవుతాడో అని మరికొందరూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇలా చేస్తే.. పెద్దయ్యాక మంచి బౌలర్ అవుతాడని కొందరూ పొగుడుతున్నారు. గల్లీ క్రికెట్ లోనే ఇలా ఆడితే.. ఇక పెద్దయ్యాక ఫామ్ లోకి వస్తే.. అతని బౌలింగ్ లో బంతి టచ్ చేయాలంటేనే వణికి పోవాల్సిందే కొందరూ ఇలా రకరకాలుగా ఈ వీడియోపై కామెంట్స్ చేయడం విశేషం.
కుర్రాడి బౌలింగ్ అదుర్స్..
సాధారణంగా క్రికెట్ లో అద్భుతమైన క్యాచ్ లు, విచిత్రమైన బౌలింగ్ శైలులు, అసాధారణమైన బ్యాటింగ్ వంటివి సోషల్ మీడియాలో నిత్యం వైరల్ గా మారుతుంటాయి. ఈ చిన్న కుర్రాడి బౌలింగ్ కూడా అలాంటి కోవాకే చెందుతుందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఇటీవలే జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో అసలు బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ తికమక బౌలింగ్ బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ కి చేరారు. దీంతో ఆ యువ బౌలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎడమ చేతితో బాల్ అందుకున్నటువంటి ఆ బౌలర్.. చేతులను మార్చి వెనక్కి, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి బాల్ మార్చుతూ చివరికీ కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడం.. క్లీన్ బౌల్డ్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
The Greatest No-ball of all time 😂
– The reaction of the bowler was priceless 😉
– A Funny Video, Must Watch 😅 pic.twitter.com/KVbf8VdY5f
— Richard Kettleborough (@RichKettle07) August 25, 2025