Anantapur News: దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది శృతి మించితే దాని పర్యావసాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక ఉదాహరణ. ఒకరికి తెలీకుండా మరొకర్ని ప్రేమించాడు ముద్దుల ప్రియుడు. ఈ మేటర్ మొదటి ప్రియురాలికి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండో ప్రేయసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
అనంతపురం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రియుడి విషయంలో ఇద్దరు ప్రియురాళ్ల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు బెదిరింపుల వరకు వెళ్లింది. ఈ విషయం ఇంట్లోవాళ్లకు తెలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ఓ యువతి, ఆత్మహత్యకు పాల్పడింది.
అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్ ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తున్నాడు. ఒకరికి తెలీకుండా మరొకర్ని లవ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మూడో వ్యక్తికి తెలీకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇద్దరి అమ్మాయిలో ఒకరు పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల స్వాతి.
మరో యువతి ప్రతిభా భారతి. ఈమె అనంతపురంలో బ్లడ్ బ్యాంకులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. అందులో అరుణ్‌కుమార్ పని చేస్తున్నాడు. అరుణ-ప్రతిభ రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. అదే సమయంలో అరుణ్‌కుమార్‌కు స్వాతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌గా మారింది.. చివరకు ప్రేమకు దారి తీసింది.
ALSO READ: కాళ్లు-చేతులు-తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు
తొలి ప్రియురాలికి తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు అరుణ్. కొన్ని విషయాలు ఓపెన్‌గా ఉండాలి. తేడా వస్తే ఊహించని అనర్థాలు జరుగుతున్నాయి. అరుణ్‌కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. అరుణ్‌కుమార్‌తో స్వాతి క్లోజ్‌గా ఉండడం ప్రతిభకు తెలిసింది.
సోమవారం ఉదయం 7 గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసింది ప్రతిభ. ఈ క్రమంలో చెడామడా ఆమెని తిట్టేసింది. అన్న-వదిన అంటూ తన ప్రియుడితో ప్రేమ నడుపుతావా అంటూ రుసరుసలాడింది. ఆ కోపంలో కారాలు మిరియాలు నూరింది కూడా. ఇద్దరి విషయం తనకు తెలిసిందని, ఈ రోజు ల్యాబ్ దగ్గర మీ సంగంతి తేలుస్తానంటూ బెదిరించింది.
ప్రతిభ ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడంతో స్వాతి భయపడింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, ఇంట్లోవాళ్లు క్షమించరని టెన్షన్ పడింది. ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న స్వాతి, ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి హాస్టల్ డోర్ ఓపెన్ కావడంతో సిబ్బంది బద్దలు కొట్టి వెంటనే ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
అదే సమయంలో పోలీసులకు కబురు పంపారు. ఆసుపత్రికి తరలించేలోపు స్వాతి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అరుణ్‌కుమార్-ప్రతిభను పిలిచి విచారణ మొదలుపెట్టారు. అలాగే స్వామి పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు. మరి దీనికి ముగింపు ఏ విధంగా ఉంటుందో చూడాలి.