Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో.. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) ను వివాహం చేసుకున్న తర్వాత అంతే వార్తల్లో నిలుస్తోంది. గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఈ జంట.. ఇప్పుడు మోసం కేసులో మరొకసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా రూ.60 కోట్లు మోసం చేశారని ఒక వ్యాపారవేత్త ఈ జంటపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది శిల్పా శెట్టి.
శిల్పా శెట్టి ఇంట విషాదం..
ఈ మేరకు తన ఇంట్లో జరిగిన విషాదం కారణంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఆమె వెల్లడించింది. ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తాము.. ఈ ఏడాది వినాయక చవితి పండుగ వేడుకలకు దూరంగా ఉంటున్నందుకు చింతిస్తున్నాము అంటూ తెలిపింది. ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె ఇలా రాసుకోచ్చారు. “ప్రియమైన స్నేహితులారా బాధతో నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ ఏడాది మేము మా గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. మా సాంప్రదాయం ప్రకారం 13 రోజులపాటు సంతాప దినాలను పాటించాలి. అందుకే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా ఉంటాము. ఈ విషయాన్ని మీతో తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాము. ముఖ్యంగా వినాయక చవితి పండుగకు దూరం కావడం మాకు మరింత బాధగా ఉంది” అంటూ ఆమె రాసుకొచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ కూడా శిల్పా శెట్టి ఇంట్లో ఎవరు చనిపోయారు అంటూ పలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అయితే శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.
శిల్పా శెట్టి సినీ కెరియర్..
మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె.. నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అలా 1993లో వచ్చిన బాజీగర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. కర్ణాటక మంగళూరులో 1975 జూన్ 8న జన్మించిన ఈమె హిందీ, కన్నడ, తెలుగు చిత్రాలలో దాదాపు 40 సినిమాలలో నటించారు. ‘ఆగ్’ అనే సినిమా ద్వారా ప్రశంసలు అందుకున్న ఈమె.. తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య’ అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు . ఈ సినిమా తర్వాత వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివి బాసూ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత హిందీ, కన్నడ చిత్రాలకే పరిమితమయ్యారు. ఇక సినిమాలే కాదు టెలివిజన్ షోస్, వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.
ALSO READ:Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!