Hero Dharma Mahesh wife : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనగా మారింది హీరో ధర్మ మహేష్ పై ఆయన భార్య పెట్టిన కేసు.. కట్నం వేధింపుల కేసు కారణంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ‘సిందూరం’, ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాల్లో నటించిన ధర్మపై ఆయన భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేస్తూ గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇన్నిరోజులు ఎవ్వరికి తెలియని మహేష్ బాగోతాల చిట్టాను ఆమె పోలీసుల ముందు పెట్టింది.. దాంతో ఈ మ్యాటర్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అవుతుంది. ఇక గౌతమి ఇటీవల పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ భర్త గురించి సంచలన విషయాలను బయటపెడుతుంది. మరో ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చిన ఆమె తన భర్త ఎవిడెన్స్ గురించి బయట పెట్టింది.. అసలు గౌతమి ఎందుకు ఇన్నాళ్ల తర్వాత కేసు పెట్టింది? మహేష్ నిజంగానే అలాంటివాడా? ఆమె ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం..
మహేష్ పై ఏం కేసు పెట్టింది..?
టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ మహేష్ గౌతమి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నా ఆయన ఆ తర్వాత గౌతమిని శారీరకంగా మానసికంగా హింసించేవాడని, వరకట్నం కోసం వేధించేవాడని పోలీస్ కేసు పెట్టింది. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ, 2013 నుంచి ధర్మ మహేష్‌తో తనకు పరిచయం ఉందని, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కానీ సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మహేష్ ఉమెనైజర్‌గా మారిపోయాడని, అతని సినిమాల్లోని హీరోయిన్లు ఇంటికొచ్చేవారని ఆమె చెప్పుకొచ్చింది. గౌతమి చెప్పిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.
Also Read : టాలీవుడ్ స్టార్ హీరోల ఇళ్ల ఖరీదు ఎంతో తెలుసా..? ఆ హీరో ఇల్లు వెరీ కాస్ట్లీ..
మహేష్ ఎఫైర్స్ ఎవిడెన్స్ తో గౌతమి..
తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చిన గౌతమి మహేష్ గురించి అతని అక్రమ సంబంధాల గురించి పూర్తి వివరాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఎంతో సంతోషంగా ఉంటామని అనుకున్నాం.. నా ఇంట్లో హీరోగా మారాడు. ఇప్పుడు నన్నే మోసం చేశాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహేష్ సినిమాలో నటించిన హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకుంటాడు. అలాగే కొంతమంది టీవీ ఛానల్ యాంకర్లతో కూడా అతనికి ఎఫైర్ ఉన్నట్లు ఆమె బయట పెట్టింది. ఈ కేసు పెట్టడానికి కారణం నా బిడ్డే అంటూ వాపోయింది. నా బిడ్డ భవిష్యత్తు కోసమే ఈ కేసు పెట్టానని ఆమె తన ఉద్దేశాన్ని బయటపెట్టింది. మహేష్ ఎక్కడెక్కడ ఏం చేశాడో ప్రతి ఒక్కటి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని, ఎవరేమన్నా కూడా వాటిని చూపించి నిజాలను జనాలకి తెలియజేస్తానని గౌతమి అంటున్నారు. మరి గౌతమి డిమాండ్ కి మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..