Ganesh Idol : సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏది వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అది వైరల్ అవుతుందా..? అనుకుంటుండగానే కొన్ని వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వైరల్ కావాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వైరల్ కావు. క్రీడా రంగంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆగస్టు 27న వినాయక చవితి ఉండటంతో సోషల్ మీడియాలో వినాయక చవితి కి సంబంధించి క్రికెట్ చెందిన కొన్ని ఇమేజ్ స్ పెట్టి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్ డికి RCB ట్రోఫీ జోడించారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. RCB ట్రోఫీతో ఉన్న బొజ్జ గణేష్ కి సంబంధించిన ఫొటో వైరల్ కావడం విశేషం.
Also Read : Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?
ఆర్సీబీ ట్రోఫీతో బొజ్జ గణేష్..
మరోవైపు ఆర్సీబీ ట్రోఫీ ఫొటో చూడగానే కొంత మంది ట్రోలింగ్స్ చేస్తున్నారు ఆర్సీబీనీ. మళ్లీ తొక్కిసలాట జరగడం గ్యారెంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా పండుగ ఉన్నప్పుడు ఆ పండుగ కి సంబంధించిన ఇమేజేస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఐపీఎల్ 2025 టైటిల్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయం సాధించిన తరువాత బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది ఆర్సీబీ. అయితే చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఆర్సీబీ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాన్ని జరుపుకోవడానికి లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియంలో గుమిగూడారు. దీంతో తొక్కిసలాట జరిగి విషాద సంఘటన చోటు చేసుకుంది.
Also Read : RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్
మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్
ఆ సమయంలో స్టేడియం వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ జనసమూహాన్ని నియంత్రించడానికి చాలా కష్టపడ్డారు. దీని ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటన తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్సీబీ మద్దతుదారులు సురక్షితంగా ఉండాలని కోరుకుంది. ఈ విషాదకరమైన ప్రాణనష్టానికి ఆర్సీబీ సంతాపం తెలియజేసింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. గాయపడిన వారికి కూడా ఆసుపత్రికి అయ్యే ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. దాదాపు 18 సంవత్సరాల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ట్రోఫీ సాధించేసరికి ఆర్సీబీ అభిమానుల్లో సంతోషాన్ని ఆపుకోలేక సంబురాలు జరుపుకోవాలని అభిమానులు భారీగా తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తాజాగా వినాయక చవితి సందర్బంగా కూడా ఆర్సీబీ ట్రోఫీని జత చేయడంతో మరోసారి తొక్కిసలాట గురించి ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం.