Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మ తన బాధను అంత వెళ్ళగక్కినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్ శర్మ, కెప్టెన్ గా తనకు ఎదురైన అనుభవాలను తాజాగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను మెచ్చుకుంటూ, అతని వల్ల టీమిండియా చాలా విజయాలు సాధించిందని కొనియాడాడు. అదే సమయంలో గౌతమ్ గంభీర్ ప్రస్తావన ఎక్కడ తీయకుండా అతని పరువు తీసే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ. గౌతమ్ గంభీర్ పై రోహిత్ శర్మ కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో తనకు అన్యాయం చేసింది అతడేనని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలో గౌతమ్ గంభీర్ పాత్ర లేదని, అతని పేరు ప్రస్తావన లేకుండానే ప్రసంగం ముగించాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
టీమిండియా విజయాలకు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని తెగ మెచ్చుకున్నారు రోహిత్ శర్మ. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజయం వెనక మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి ఎంతో ఉందని వెల్లడించారు. ముంబైలో తాజాగా సియట్ క్రికెట్ రేటింగ్స్ అవార్డ్స్ 2025 ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా రోహిత్ శర్మతో పాటు శ్రేయాస్ అయ్యర్, సంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త లుక్ లో రోహిత్ శర్మ మెరిశాడు. అయితే ఈవెంట్ లో రోహిత్ శర్మ కీలక ప్రసంగాన్ని ఇచ్చాడు.కెప్టెన్సీ నుంచి తొలగించడం అలాగే తన కెప్టెన్సీలో సాధించిన విజయాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం వెనక రాహుల్ ద్రావిడ్ పాత్ర ఉందని చెప్పిన రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ పేరు ప్రస్తావించకుండా ప్రసంగం ముగించాడు.
వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సమయంలో గౌతమ్ గంభీర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అతని పేరు ప్రస్తావించకుండా క్రెడిట్ మొత్తం రాహుల్ ద్రావిడకు ఇచ్చాడు రోహిత్ శర్మ. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత, మళ్లీ చివరి మెట్టుపై బోల్తా పడకుండా టి20 ప్రపంచ కప్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి గెలిచామని గుర్తు చేశారు. గౌతమ్ గంభీర్ పరువు తీసేందుకు రోహిత్ శర్మ, ఇలా ప్రసంగించారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగనున్న వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీని తొలగించింది బీసీసీఐ. అయితే ఈ కెప్టెన్సీ ని తీసివేయడానికి కారణం గౌతం గంభీర్ అని చర్చ జరుగుతోంది. గిల్ కు న్యాయం చేసి రోహిత్ శర్మకు అన్యాయం చేసే కుట్రలో భాగంగా గౌతమ్ గంభీర్ స్కెచ్ వేసినట్లు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
ROHIT SHARMA TALKS ABOUT HIS EMOTIONAL PERIOD IN INDIAN CRICKET. 🥹❤️ pic.twitter.com/trp22tcmNw
— Johns. (@CricCrazyJohns) October 8, 2025