BigTV English

Ronaldo to play for Al Nasser club: అల్ నాసర్ క్లబ్ తరఫున బరిలోకి రొనాల్డో

Ronaldo to play for Al Nasser club: అల్ నాసర్ క్లబ్ తరఫున బరిలోకి రొనాల్డో

Ronaldo to play for Al Nasser club: పోర్చుగల్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో… సౌదీ అరేబియా క్లబ్‌ అయిన అల్‌ నాసర్‌ తరఫున ఆడబోతున్నాడు. గత శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించిన ఆ క్లబ్‌… తాజాగా రియాద్‌లో రొనాల్డో పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధికంగా 211 మిలియన్‌ డాలర్లకు… అంటే మన కరెన్సీలో రూ.1747 కోట్లకు అల్‌ నాసర్‌ క్లబ్‌తో రొనాల్డో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత భారీ ఒప్పందాన్ని చూసి… సాకర్ ప్రపంచమే కాదు… వరల్డ్ మొత్తం షాకైంది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ యాజమాన్యంతో విభేదాల కారణంగా ఆ క్లబ్‌ను వీడిన రొనాల్డో… ఇక అల్ నాసర్ క్లబ్ తరఫున ఫుట్ బాల్ మైదానంలో కనిపించబోతున్నాడు.


మరోవైపు… రొనాల్డో అల్ నాసర్ క్లబ్ తరఫున ఆడబోతున్నాడని తెలియగానే… ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జట్టు ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. రొనాల్డో ఒప్పందానికి ముందు అల్ నాసర్ క్లబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలే. కనీసం మిలియన్ కూడా లేని అల్ నాసర్ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య… డీల్ జరిగిన 48 గంటల తర్వాత 30 లక్షలకు చేరగా… ప్రస్తుతం 90 లక్షలకు చేరింది. ఈ ఫాలోవర్ల సునామీ ఇంకా కొనసాగుతుందని అల్ నాసర్ భావిస్తోంది. దీన్ని బట్టి… సాకర్ ప్రపంచకప్‌ నుంచి కన్నీటితో నిష్క్రమించిన రొనాల్డోకు… క్రేజ్‌ కొంచెం కూడా తగ్గలేదని అర్థమవుతోంది.

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయింగ్‌లోనూ క్రిస్టియానో రొనాల్డోకు తిరుగులేదు. ఇన్‌స్టాగ్రామ్‌ సొంత ఖాతాకు అత్యధికంగా 586 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా… ఆ తర్వాతి స్థానంలో క్రిస్టియానో రొనాల్డోదే. ఇన్‌స్టాలో రోనాల్డోను 527 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆ తర్వాత స్థానం మరో సాకర్‌ స్టార్‌ లియోనెల్ మెస్సీది. అతనికి ఇన్‌స్టాలో 414 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×