Big Stories

RCB Playoff Chances 2024: ఇక ఆర్సీబీ ఇంటికే.. ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయినట్టే..!

RCB Playoff Chances 2024: కోల్‌కతాతో జరిగిన జీవన్మరణ పోరులో ఆర్సీబీ చివరి వరకు పోరాడి ఒక్క పరుగుతేడాతో ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితుల్లో ఆర్సీబీ ఆడింది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలి. ఇక్కడ నుంచి గెలుస్తూనే వెళ్లాలి. అలాగైతేనే రేస్ లో ఉంటారు. లేదంటే లేదు. అలా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో వారికి అదృష్టం కలిసి రాలేదు.

- Advertisement -

ఈ ఓటమితో ప్లేఆఫ్ కి వెళ్లే దారులు ఆర్సీబీకి దాదాపు మూసుకుపోయాయనే చెప్పాలి. ఇక ఆర్సీబీ ఇంటికేనని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అందుకనే విరాట్ కొహ్లీ అంతగా అంపైర్లతో గొడవేసుకున్నాడని అంటున్నారు. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి ఉండకపోతే, కొహ్లీ అవుట్ కి పెద్ద విలువ కూడా ఉండేది కాదని కూడా చెబుతున్నారు.

- Advertisement -

విషయానికి వస్తే, ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ ఒకటి గెలిచి ఏడింట్లో ఓడిపోయింది. ప్లే ఆఫ్ కి చేరాలంటే కనీసం 8 మ్యాచ్ లు గెలవాలి. అప్పుడు 16 పాయింట్లతో ప్రశాంతంగా వెళ్లవచ్చు. ఇంకా ఆర్సీబీ ఆడాల్సినవి ఆరు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో గెలిచినా 14 పాయింట్లు అవుతాయి. అప్పుడు ప్లే ఆఫ్ లో మిగిలిన జట్ల బలాబలాలు, నెట్ రన్ రేట్లు వీటన్నిటిపై ఆధారపడి ముందంజ వేయాల్సి ఉంటుంది.

Also Read: ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. హోరాహోరీ పోరులో కోల్‌కతా విజయం

ఏడు మ్యాచ్ లు ఓడిపోయిన ఆర్సీబీ, ఇప్పుడు మళ్లీ పుంజుకుని అన్నీ గెలవడమనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇకపోతే ప్రతి సీజన్‌ మొదలయ్యే ముందు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌, ‘ఈ సాలా.. కప్‌ నమ్‌దే’ అంటూ ప్రచారం మొదలు పెడుతుంది. బెంగళూరు అభిమానులు కూడా ఇదే స్లోగన్‌తో టీమ్‌కు సపోర్ట్‌ చేస్తుంటారు. నిరాశ చెందుతుంటారు.ఇది వారికి, జట్టుకి అలవాటైపోయింది.

ఇక ఆర్సీబీ జట్టులో లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. మొత్తం జట్టునే విరాట్ తో సహా ప్రక్షాళన చేస్తేనేగానీ, అది మళ్లీ ట్రాక్ లోకి రాదని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ప్రతిచోటా అలసత్వం పేరుకుపోయింది. అది ఒక్కరున్నా మళ్లీ ఇతరులకి అంటుకుంటుంది. అందుకనే వచ్చే ఏడాది ఆర్సీబీ కొత్తరక్తంతో ముందుకు రాకపోతే, ప్రతి ఏడాదిలాగే, 2025లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని వళ్లు మండిన ఆర్సీబీ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News