NTR Changed his Car Number 9999 to 1422: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్లు అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే తారక్ గ్యారేజ్ లో ఎన్నో కార్లు ఉన్నాయి. ఇక ఈ మధ్యనే ఆయన మెర్సిడెజ్ బెంజ్ సెడాన్ కారును కోనుగోలు చేసిన విషయం తెల్సిందే. మొదటి నుంచి కూడా తారక్ కారు నెంబర్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. 9999 నెంబర్ మాత్రమే తారక్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. దీనికోసం లక్షలు ఖర్చుపెట్టిన రోజులు కూడా ఉన్నాయ్. 9999 అనేది ఒక బ్రాండ్. ఈ కారు నెంబర్ ఉంది అంటే అందులో ఎన్టీఆర్ ఉన్నాడని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అంతలా ఈ నెంబర్ అభిమానుల మనస్సులో నిలిచిపోయింది. అయితే ఈ సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేశాడు.
తాను కొత్తగా కొన్న కారుకు 1422నెంబర్ ను తీసుకున్నాడు. ఇదేంటి.. ఎప్పుడు లేనిది తారక్ కారు నెంబర్ మార్చదు. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు..9999 నెంబర్ అంత కన్నా కాదు. మరి ఇలాంటి నెంబర్ ఎందుకు తీసుకున్నాడు అని అభిమానులందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఫ్యాన్స్ ఆరా తీస్తే సమాధానం దొరక్కుండా ఉంటుందా.. ? తారక్ ఈ నెంబర్ ను కావాలనే తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ నెంబర్ లో తన ఇద్దరు కొడుకుల పుట్టినరోజులు కలవడంతో.. ఈ నెంబర్ ను తీసుకున్నాడు. తారకు కు ఇద్దరు కుమారులు.
Also Read: Prathinidhi 2: బ్రేకింగ్.. ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా
పెద్ద కొడుకు అభయ్ రామ్.. 2014 జూలై 22 న జన్మించగా.. రెండో కొడుకు భార్గవ్.. 2018 జూన్ 14 న జన్మించాడు. వీరిద్దరి బర్త్ డేస్ ను కలిసి 1422 నెంబర్ తీసుకున్నాడని సమాచారం. ఇకనుంచి ఇదే నెంబర్ ను తారక్ వాడనున్నాడని తెలుస్తోంది. ఏదిఏమైనా తారక్ .. పిల్లలపై చూపిస్తున్న ప్రేమ బావుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.