BigTV English
Advertisement

Sachin Tendulkar : అందరినీ పిలిచేవాడిని.. డక్ అవుట్ అయిపోయేవాడిని.. సచిన్..!

Sachin Tendulkar : అందరినీ పిలిచేవాడిని.. డక్ అవుట్ అయిపోయేవాడిని.. సచిన్..!

Sachin Tendulkar : ఇండియన్ క్రికెట్‌లోకి 16 ఏళ్ల వయసులో వచ్చాను. అయితే నా క్రికెట్ ట్రైనింగ్ అంతా,  మా కాలనీలోనే జరిగిందని, వాళ్లే నా మొదటి ప్రేక్షకులని సచిన్ టెండుల్కర్ అన్నాడు. తన చిన్ననాటి జ్నాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ పెట్టాడు.


అప్పుడు నేను బాగా చిన్నవాడిని, మా సాహిత్య సహవాస్ కాలనీలో క్రికెట్ టీమ్ ఒకటి ఉండేది. అందులో నేనే ప్రధాన బ్యాటర్. ఆరోజు మా ఫ్రెండ్స్‌తో ఒక మ్యాచ్ ఏర్పాటు చేశా. ఈరోజు మ్యాచ్ ఉంది రమ్మనమని ఇంటింటికి వెళ్లి చెప్పా.. స్కూల్ నుంచి రాగానే, నా పని ఇదే.. క్రికెట్ ఒకటే ప్రపంచంగా ఉండేది.

నా టెక్నిక్‌ని ముందు కనిపెట్టినవాడు మా అన్నయ్య. తనే నన్ను ప్రోత్సహించాడు. సరే, కాలనీలో ఖాళీగా ఉన్నపెద్దవాళ్లు వచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చారు, నేను వారందరి ముందు బ్యాట్ పట్టుకు వీరోచితంగా వెళ్లాను. కానీ మొదటి బాల్ కి డక్ అవుట్ అయ్యాను. అయ్యో.. అని మా కాలనీవాసులందరూ బాధపడ్డారు.


కానీ నాకు చాలా సిగ్గేసింది. చాలా బాధపడ్డాను. బాల్ చాలా తక్కువ ఎత్తులో వచ్చింది, అందుకే అవుట్ అయ్యానని అన్నాను. కరెక్టే అని వాళ్లు కూడా ఒప్పుకున్నారు. అయితే నా వయసు వల్ల అలా చెప్పారో లేక నిజంగా అన్నారో తెలీదు. తర్వాత మళ్లీ పట్టుదల వచ్చింది. మరో సండే మ్యాచ్ పెట్టి, ఎప్పటిలా ఇంటింటికి వెళ్లి అందరినీ పిలిచాను.

పాపం ఆరోజు కూడా అందరూ వచ్చారు. మళ్లీ నా రెండో మ్యాచ్ మొదలైంది. నేను సీరియస్ గా వెళ్లి, మళ్లీ సున్నాకే అవుట్ అయిపోయాను. ఈసారి పిచ్ బాగాలేదు, అక్కడ రాయి ఉంది, దాని మీద బాల్ పడి పైకి లేచింది, అని కుంటి సాకులు చెప్పాను. పాపం వాళ్లు దానికీ ఒప్పుకున్నారు. నన్ను కించపరచలేదు. సరికదా, నా ఉత్సాహాన్ని నీరుగార్చలేదు.  

మూడోవారం సండే, మళ్లీ అందరి ఇంటికి వెళ్లి పిలిచాను. వాళ్లు నాలో ఉత్సాహాన్ని చూసి సరే, వస్తామని తెలిపారు. బహుశా ఆదివారం ఖాళీగా ఉండటం వల్ల అనుకుంటా, ఫ్రెండ్స్‌తో కలిసి పేరెంట్స్ వచ్చారు. సరే, నా మూడో మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఒక్క పరుగు మాత్రమే చేసి రన్ అవుట్ అయిపోయాను.

చిన్నోడు కదా.. పరుగెత్తలేకపోయాడని అంతా అనుకున్నారు. కానీ నా మనసులో, ఆ పదిమందిలో చేసిన ఒక్క పరుగు అలా నిలిచిపోయింది. శివాజీ పార్క్ నుంచి బాంద్రాకు స్కూల్ బస్సులో వెళ్లేటప్పుడు, ఆ చిన్న గ్రౌండ్ చుట్టూ తిరిగి వెళుతుంటే ఆ రన్, నన్ను ఇన్ స్పైర్ చేసేది. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ రన్స్ చేయాలనే ఒక ఇన్సిపిరేషన్ బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క పరుగు నా ఆలోచనా విధానాన్నే మార్చేసిందని అన్నాడు.

ఆ రోజు నేనే ఇంటింటికి వెళ్లి నా మ్యాచ్ ఉంది రమ్మనమని పిలిచేవాడిని, కానీ ఇండియన్ క్రికెట్‌లోకి వచ్చాక, పిలవకుండానే గ్రౌండ్‌కి వచ్చేవారు. గ్రౌండ్‌లో, టీవీల ముందు ప్రజలను చూస్తుంటే, నా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చేవి..

ఒకప్పుడు నా క్రికెట్‌ని నేనే ప్రేమించేవాడిని, అందరూ నా ఆటని చూడాలని అనుకునేవాడిని, ఇప్పుడు భారతీయులందరూ నా ఆటని ప్రేమిస్తున్నారు. పిలవకుండానే అందరూ వస్తున్నారు. ఈ అభిమానం, భయం, బాధ్యత అన్నీ నాలో రోజురోజుకి పెరిగాయి. అందుకే అన్నేళ్లు క్రికెట్ ఆడగలిగానని తెలిపాడు. నిరంతరం బ్యాటింగ్‌లో కొత్త విషయాలు నేర్చుకుని, నన్ను నేను మార్చుకునేవాడినని తెలిపాడు.

నిజానికి సచిన్ టెండుల్కర్ తన చిన్ననాటి జ్నాపకాన్ని చెప్పినా, నేటి యువతకు అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో ఉన్నాయని, మనకి ఏదైతే ఇంట్రస్టు ఉందో, దానిపై మనసు పెట్టి పనిచేయాలని, విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుందని నెట్టింట పలువురు కామెంట్ చేస్తున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×