BigTV English

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

Shikhar Dhawan explains retirement call, admits playing IPL won’t be enough for national comeback: టీమిండియా గబ్బర్‌ గా పిలుచుకునే శిఖర్ ధావన్ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా తన రిటైర్మెంట్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు శిఖర్ ధావన్. భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ ఆగస్టు 24వ తేదీన దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గబ్బర్ 14 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు తెరపడింది. ఈ 14 సంవత్సరాల లో ధావన్ భారత్ తరపున అద్భుతంగా ఆడి తన సత్తాను చాటడంతో పాటు భారీగానే తప్పులను సంపాదించాడు.


టీమ్ ఇండియా నుంచి వచ్చే జీతం, ఇతర ఎండార్స్మెంట్ లు, ఇతర మార్గాల ద్వారా భారీగానే ఆదాయం చేకూరింది. వీటి ఆధారంగా శిఖర్ ధావన్ టీం ఇండియాలోని ధనవంతులైన ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయితే శిఖర్ ధావన్ ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ప్రతి ఒక్కరిలో ధావన్ క్రికెట్ కెరీర్ కు ఎందుకు గుడ్ బై చెప్పాడనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉండేది. తాజాగా ధావన్ ఓ నేషనల్ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ…. తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలియజేశాడు.

ఆ వీడియో ఛానల్ లో మాట్లాడుతూ…నా కెరీర్ చివరి రెండు సంవత్సరాల్లో నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడింది తక్కువే. ఐపీఎల్ మ్యాచ్ లు ఎక్కువగా ఆడటం జరిగింది. ఎంతో కెరీర్ ఊహించుకొని ఎక్కువ మ్యాచ్లు ఆడాలి అని అనుకున్నానని తెలియజేశాడు. కానీ నాకు రెస్ట్ తీసుకోవాలని అనిపించింది. దాంతో ఎక్కువగా మ్యాచ్లు ఆడలేకపోయాను. ఫామ్ లో నిలబడలేకపోయాను. ఇక టీమిండియాలో చోటు కోసం దేశవాళీ క్రికెట్ లో ఆడాలన్న ఆసక్తి నాకు లేదు. అందుకే డొమెస్టిక్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ తీసుకున్నానని శిఖర్ ధావన్ పేర్కొన్నారు.


Also Read:  IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

ఈ మధ్యకాలంలో ఎంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యానని తెలిపారు శిఖర్ ధావన్. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరియర్ లో నేను సాధించిన దానిపట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ నాలో ఒకే ఒక్క లోటు ఉండిపోయింది. ప్రపంచకప్ తెలిస్తే చాలా బాగుండేదంటూ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాన్ని వెల్లడించాడు శిఖర్ ధావన్. కాగా, 38 ఏళ్ల భావం 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. 2022లో చివరిగా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు శిఖర్ ధావన్ . ఓపెనర్ గా అరుదైన రికార్డులను నెలకొల్పారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 117 మ్యాచుల్లో 45.15 సగటుతో 5193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు శిఖర్ ధావన్.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×