IND Vs PAK : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ సెప్టెంబర్ 14న జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయంతో టీమిండియా సూపర్ 4 కి చేరిన తొలి జట్టుగా నిలిచింది. ప్రధానంగా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని.. Boycott అంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ కి ముందు మ్యాచ్ ఆడకూడదని పేర్కొన్నారు. అయితే ఈ మ్యాచ్ విజయం సాధించిన తరువాత ప్రతీ భారతీయుడు గర్వపడ్డాడు. పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించి.. అందరితో టీమిండియా శభాష్ అనిపించుకుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు టీమిండియా కెప్టెన్ ఆసక్తి చూపించలేదు.
Also Read : Suryakumar Yadav : సూర్య నిజంగా మగాడ్రా.. పహాల్హామ్ పై షాకింగ్ ప్రకటన
మరోవైపు మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివమ్ దూబే మైదానం నుంచి వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు ఎవ్వరూ గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తరువాత ప్రత్యర్థిని గౌరవిస్తూ షేక్ మ్యాండ్ ఇస్తారు. కానీ టాస్ వేసే సమయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్ కి సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా మ్యాచ్ తరువాత పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాను పక్కన పెట్టండి. మీ పని కేవలం ఇండియా కోసం ఆడటమే. పహల్గామ్ అటాక్ ను మరిచిపోవద్దు. ఎవ్వరితోనూ హ్యాండ్ షేక్ ఇవ్వకండి. మైదానంలో మీ బెస్ట్ ఇవ్వండి అని మ్యాచ్ కి ముందు టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా ఆయన పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడారు.
మరోవైపు మ్యాచ్ ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు ఎవ్వరూ కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ వెలుపల షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెల్లారు. డ్రెస్సింగ్ రూమ్ కి కూడా డోర్లు వేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్.. “మేము పహల్గామ్ బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్ స్పైర్ చేస్తారని భావిస్తున్నా” అంటూ తన ప్రసంగాన్ని ముగించేశాడు సూర్యకుమార్ యాదవ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగా.. టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో 131 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.