Paris: పారిస్ ఓ అద్భుతమైన నగరం. ఈ నగరం దాని కళ, ఫ్యాషన్, అక్కడ కల్చర్, ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లైన ఈఫిల్ టవర్‌తో ప్రసిద్ధి చెందింది. సీన్ నది వెంట ఉన్న ఈ నగర.. “ది సిటీ ఆఫ్ లైట్స్” గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇంత వరకే మనకు తెలుసు.. అయితే అసలైన పారిస్ నగరం అది కాదని.. ఇలా ఉంటుందని భారతీయ పర్యాటకుడు వినాయక్ మిశ్రా ఓ వీడియోలో చాలా క్లియర్ కట్ గా చూపించాడు. పారిస్‌లోని ఒక రైల్వే స్టేషన్ వద్ద దిగిన వెంటనే ఎదురైన అనూహ్య దృశ్యాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
‘పారిస్ నాకు తొలి ఐదు నిమిషాల్లోనే షాక్ ఇచ్చింది’ అని శీర్షిక పెట్టి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అతను రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు చెత్తాచెదారం, అరుపులు, గందరగోళ వాతావరణం కనిపించాయి. “ఇది ఏమిటి? ఇది పారిస్ నగరమా..? ఫిష్ మార్కెట్ లాగా ఉంది” అని ఆశ్చర్యంగా ఉందన్నట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత, అతను మరో ప్రాంతంలోకి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, అయితే మొదటి ప్రాంతం వింతగా, గజిబిజిగా ఉందని చెప్పారు. పారిస్ నగరం ఇలా ఉంటుందని అనుకోలేదని మిశ్రా తన నిరాశను వ్యక్తం చేశారు.
వీడియో క్యాప్షన్‌లో.. పారిస్ ఒక వివిధ సాంస్కృతిక నెలకొన్న నగరమని, ప్రతి ప్రాంతం ఒకేలా ఉండదని మిశ్రా వివరించారు. “భారతదేశంలో లాగే, ప్రతి ప్రదేశానికి విభిన్న కోణాలు ఉంటాయి, అదే ప్రయాణాన్ని ఆసక్తికరంగా చేస్తుంది” అని పేర్కొన్నారు. ఈ వీడియో 15 లక్షలకు మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో కింద వేలాది కామెంట్లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు పారిస్‌లోని కొన్ని ప్రాంతాలు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయని, ముఖ్యంగా సెంట్రల్ పారిస్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక నెటిజన్ ‘సెంట్రల్ పారిస్‌లో ఉండండి. కొద్దిగా బయటకు వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రాత్రి వేళల్లో అలాంటి ప్రాంతాల్లోకి వెళ్లొద్దు, అది చాలా ప్రమాదం’ అని కామెంట్ చేశారు.
ALSO READ: Indiramma Canteens: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. రూ.5కే టిఫిన్, ప్రారంభించనున్న సీఎం
ఈ వీడియో పారిస్ గురించి “పారిస్ సిండ్రోమ్” అనే భావనను కూడా బయటపెట్టింది. ఈఫిల్ టవర్, ఆర్క్ డి ట్రయంఫ్, నోట్రే-డామ్ కేథడ్రల్, లౌవ్రే వంటి ప్రసిద్ధ స్థలాలతో పారిస్ పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొందరు పర్యాటకులు నగరం గురించి తమ ఊహించిన అద్బుతమైన ప్లేసెస్ కు భిన్నమైన వాస్తవికతను చూసి నిరాశకు గురవుతారు. ఈ “పారిస్ సిండ్రోమ్” అనేది ఒక రకమైన సాంస్కృతిక షాక్ అని చెప్పవచ్చు. మీడియా తరచూ పాశ్చాత్య నగరాల శుభ్రమైన ప్రాంతాలను మాత్రమే చూపిస్తుందని, భారతీయ నగరాల గురించి మాత్రం ప్రతికూల చిత్రాలను ఇస్తుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ వీడియో పారిస్‌లోని విభిన్న కోణాలను, బహుసాంస్కృతిక స్వభావాన్ని ఆవిష్కరించి, నగర పర్యాటన గురించి ఆసక్తికరమైన చర్చకు దారితీసిందని చెప్పవచ్చు.