IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్ వర్సెస్ పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అంతా హై వోల్టేజ్ ఉంటుందని భావించారు. కానీ ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఇద్దరూ బ్యాటర్లు ఓపెనర్ పర్హాన్ 40, షాహిన్ అఫ్రిది 33 నాటౌట్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ టీమిండియా బౌలర్ల ధాటికి పరుగులు చేయలేకపోయారు. దీంతో టీమిండియా ముందు పాకిస్తాన్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో పోటీ ఇవ్వలేకపోయింది. అయితే ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Irfan Pathan : పాకిస్థాన్ మిస్సైల్స్ లాగే…వాళ్ల వికెట్లు రాలిపోయాయి
తొలుత పాకిస్తాన్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బరిలోకి దిగింది. టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ 31, శుబ్ మన్ గిల్ 10, సూర్యకుమార్ యాదవ్ 47 నాటౌట్, తిలక్ వర్మ 31, శివమ్ దూబే 10 నాటౌట్ చెలరేగారు. దీంతో టీమిండియా 15.5 ఓవర్లలో 131/3 పరుగులు చేయగలిగింది. గ్రౌండ్ లో టీమిండియా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే సందర్భంలో ఓ పాకిస్తాన్ అభిమాని కూడా సంబురం చేసుకున్నాడు. అయితే అతను తొలుత పాకిస్తాన్ జెర్సీ ధరించి మ్యాచ్ ని వీక్షించాడు. ఆ తరువాత పాకిస్తాన్ ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ జెర్సీ మీదుగా టీమిండియా జెర్సీ ధరించి డ్యాన్స్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ అభిమానులు ఇలా కూడా చేస్తారా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తరువాత నో- హ్యాండ్ షేక్ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పై క్రాప్ట్ ను ఆసియా కప్ 2025 మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కి సంబంధించిన ఎంసీసీ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మ్యాచ్ రిఫరీ పై ఐసీసీకి పీసీసీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ని తక్షణమే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసిందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ జట్టు ఆటలో తమ ప్రతిభను చూపించలేకపోయినా.. ఇలాంటి వాటిలో, వివాదాల్లో ఎప్పుడూ ముందుంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవానికి టీమిండియా.. పాకిస్తాన్ తో ఆడకూడదని చాలా మంది పహల్గామ్ బాధితులు, అభిమానులు కోరారు. అయినప్పటికీ బీసీసీఐ నిర్ణయంతో టీమిండియా పాకిస్తాన్ తో పోరాడి ఘన విజయం సాధించింది. అయితే ఇండియాను ఇరుకున పెట్టాలని పాకిస్తాన్ ఎత్తుగడలు వేస్తోంది. కానీ అవి చెల్లవు అని పలువురు పేర్కొంటున్నారు.
Akhir India ki hi Paidaish hai🤣
Baap ke paas akar he chupay ga ye porki🤣#indvspak2025 #INDvPAK #PAKvIND #PakVsInd #PakistanCricket pic.twitter.com/n0eMsmp5oK— Pathan Bhai (@PathanBhaiii) September 14, 2025