IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా భారత్ వర్సెస్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం పాకిస్తాన్ కి చెందిన ఇద్దరూ బ్యాటర్లు ఓపెనర్ పర్హాన్ 40, షాహిన్ అఫ్రిది 33 నాటౌట్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ టీమిండియా బౌలర్ల ధాటికి పరుగులు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లు పాక్ ని కోలుకోలేని దెబ్బ తీశారు. ఒక దశలో 100 పరుగులు కూడా దాటదు అనుకున్న తరుణంలో షాహిన్ అఫ్రిది బరిలోకి దిగి 6లతో 33 పరుగులు సాధించాడు. లేదంటే 100 లోపు ఆలౌట్ అయ్యేది.
Also Read : IND Vs PAK : ఇండియా టార్చర్ తట్టుకోలేక… పాకిస్తాన్ జెర్సీ మార్చిన అభిమాని.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ కి సూర్యకుమార్ న్యాయం చేశాడని.. ఆర్మీ ఆఫీసర్ ఓ మహిళకు సింధూరం పెట్టగా.. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ కి సూర్యకుమార్ సింధూరం పెడుతున్నట్టు ఓ వీడియో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. దానికి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి పాకిస్తాన్ పై విజయం సాధించి సూర్యకుమార్ న్యాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఇండియ ఓపెనర్లు అభిషేక్ శర్మ 31, శుబ్ మన్ గిల్ 10, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 నాటౌట్, తిలక్ వర్మ 31, శివమ్ దూబే 10 నాటౌట్ చెలరేగారు. దీంతో టీమిండియా 15.5 ఓవర్లలో 131/3 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ అభిమానులు షాక్ అయ్యారు. టీమిండియా బ్యాటర్లు ఇంతలా బ్యాటింగ్ చేస్తారా..? అన్నట్టు ఆశ్చర్యకరంగా చూడటం విశేషం. మరోవైపు మ్యాచ్ లో గెలవడం ఒక ఎత్తయితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీపైక్రాప్ట్ ను ఆసియా కప్ 2025 మ్యాచ్ రిఫరీల ఫ్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఐసీసీకి పీసీసీ ఫిర్యాదు చేసింది. షేక్ హ్యాండ్ వివాదం పై ఐసీసీకి ఫిర్యాదు చేయడం విశేషం. వాస్తవానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడంతో మ్యాచ్ ఆడకూడదని కొందరూ టీమిండియా అభిమానులు పేర్కొన్నారు. అందుకే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అయితే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ ఆటగాళ్లు ఐసీసీకి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.
?igsh=bzJocmZnc3c5OWpr