Irfan pathan : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఇద్దరూ బ్యాటర్లు మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా భారత్ పై దాడి చేసిన మిస్సైల్స్ లాగే.. నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ వికెట్లు టప్పా టప్పా రాలిపోయాయి అని తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : IND Vs PAK : ‘నో హ్యాండ్‌షేక్’ కుట్ర చేసింది ఇతనేనా.. పాక్-టీమిండియా మంట పెట్టాడుగా !
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా తొలి బంతి వైడ్ వేసే సరికి అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ తరువాత బంతికే తొలి వికెట్ తీసుకున్నాడు. దీంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బుమ్రా 2, కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 1 చొప్పున వికెట్లను తీశారు. దీంతో పాక్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ జట్టు భారత్ కి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రెండింటిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు తొలుత పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలు అని కొంత మంది అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ తో ఒకసారి, మైదానంలో తాజాగా మరోసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు గతంలో ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2006లో పాకిస్తాన్ టూర్ సందర్భంగా అఫ్రిదితో జరిగిన ఓ సంఘటనను ఇటీవలే గుర్తు చేశాడు పఠాన్. 2006లో కరాచీ నుంచి లాహోర్ కి రెండు దేశాల ఆటగాళ్లూ ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలో అఫ్రిది.. పఠాన్ వద్దకు వచ్చి ఏరా అబ్బాయి.. ఎలా ఉన్నావ్..? అని అడిగాడు. దీంతో పఠాన్ అతను నా తండ్రి ఎప్పుడు అయ్యాడని మనస్సులో అనుకున్నాడట. అఫ్రిది ప్రవర్తన పై కోపంతో ఉన్న పఠాన్ పక్కనే ఉన్న పాక్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ని ఓ ప్రశ్న అడిగాడట. ఈ ప్రాంతంలో ఏ మాంసం ఎక్కువ దొరుకుతుందని అడగ్గా..? దానికి రజాక్ పలు మాంసం పేర్లు చెబుతుండగా.. పఠాన్ కుక్క మాంసం దొరుకుతుందా..? అని ప్రశ్నించాడట. ఆశ్చర్యపోయిన రజాక్ అలా అడిగావ్ అని అడగ్గా.. పఠాన్ సమాధానం చెబుతూ అఫ్రిది కుక్క మాంసం తిన్నాడనుకుంటా.. అందుకే చాలా సేపటి నుంచి కుక్కలా మొరుగుతున్నాడని చెప్పాడట. దీంతో పఠాన్ తో అఫ్రిది మాట్లాడలేదట. ఇటీవలేఓ యూట్యూబ్ ఛానల్ కి ఈ విషయాన్ని వెల్లడించాడు అఫ్రిది.