Delhi Accident: ఢిల్లీలో ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్‌లపై పడిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం హైదర్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ముఖర్బా చౌక్ ఫ్లైఓవర్ వద్ద జరిగింది.
ఎలా జరిగింది?
ఘాజియాబాద్‌కు చెందిన సచిన్ చౌదరి మారుతి సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే తాను నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి, ఫ్లైఓవర్ పై నుంచి రైల్వే ట్రాక్ పక్కనున్న ఫుట్‌పాత్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు తలకిందులై రైల్వే పట్టాలపై ఎగిరి పండింది. దీంతో అక్కడ పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందులో సచిన్ చౌదరిని బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also Read: BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ.107 ప్లాన్ 84 రోజులు ఇస్తుందా? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సచిన్ చౌదరి మాట్లల్లో యాక్సిడెంట్ వివరాలు
కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సచిన్ చౌదరి మాట్లాడుతూ, తాను పీరాగఢి నుంచి ఘాజియాబాద్ వెళ్తున్నానని, ఆ సమయంలో ఫ్లైఓవర్ పై రైల్వే ట్రాక్ దగ్గర కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిందని చెప్పారు. అనంతరం రైలింగ్ దాటి కిందపడి, చివరికి రైల్వే పట్టాలపై పడిపోయిందని వివరించారు. ఈ ప్రమాదంతో రైలు రాకపోకలకు అంతరాయం కలగడంతో వెంటనే ఢిల్లీ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు కలిసి కారు ట్రాక్‌ల నుంచి తొలగించారు. కొద్ది సేపటికే రైల్వే రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయని వెల్లడించాడు.
మరో బైక్.. ఏం జరిగింది?
ఇక్కడ మరో ఘటన షాకింగ్‌కు గురి చేసింది. అదే అక్కడున్న బైక్. ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే రైల్వే ట్రాక్‌లపై ఒక పల్సర్ బైక్ కూడా కనిపించింది. దీంతో అక్కడున్న వారు మరింత గందరగోళానికి గురయ్యారు. అయితే విచారణలో ఆ బైక్‌కు ఈ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. ప్రమాదం జరిగే ముందు రోజే ఆ బైక్ అక్కడ వుందని అధికారులు తెలిపారు. కారు ప్రమాదం, బైక్ విషయం రెండూ పూర్తిగా వేర్వేరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ బైక్ యజమానిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.