IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా మరికొద్ది గంటల్లోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలు టీమిండియా ఆటగాళ్లు ఎవ్వరెవరు బరిలోకి దిగుతారు. బౌలర్లు ఎవ్వరూ..? బ్యాటర్లు ఎవ్వరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు యూఏఈకి ఆడిన జట్టే ఆడుతుందని.. మరోవైపు శివమ్ దూబే స్థానంలో అర్ష్ దీప్ సింగ్ బరిలోకిదిగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..? తాజాగా మరో వార్త కూడా వైరల్ అవుతోంది. బ్రాంకో టెస్ట్ తరువాత టీమిండియా ఆటగాళ్లకు కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ను పరిచయం చేసింది. ఆసియా కప్ లో పాకిస్తాన్ మ్యాచ్ కి ముందు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు.
Also Read : Grace Hayden : దయచేసి ఆ పని చెయ్… లేకపోతే నగ్న***గా తిరగాల్సి వస్తుంది… హెడెన్ కూతురు ఎమోషనల్
ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలుగు వ్యక్తి. అయితే అతని ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్ లో ఆటగాళ్లు అంతా కదిలి క్యాచ్ లు అందుకోవాలి. ప్రతి క్రీడాకారుడు ఐదు క్యాచ్ ల రెండు సెట్లను పూర్తి చేస్తూ తమ లక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ డ్రిల్ లో ఆటగాళ్ళు గార్డ్ లను మార్చుకుంటూనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఒక మిస్ తో, తరువాత ఒక బ్లైండర్ తో ఈ డ్రిల్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆకట్టుకోగా.. గిల్ క్లిష్టమైన నాలుగు క్యాచ్ లు పట్టి ప్రశంసలు అందుకున్నాడు. రెండో సెట్ లో మాత్రం రింకూసింగ్ విజేతగా నిలిచి మెడల్ అందుకున్నాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా హైదరాబాద్ కు చెందిన టి. దిలీప్ ఫీల్డింగ్ లో మంచి అనుభవం ఉంది. అతని ఫీల్డింగ్ లోనే కొత్త కొత్త టాస్క్ లను ఎదుర్కొంటుంది. దీంతో ఫీల్డింగ్ లో టీమిండియా పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించడంలో ఈ తెలుగోడు సత్తా చాటుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం. వాస్తవానికి కోచ్ దిలీప్ రిటైర్మెంట్ కావాల్సినప్పటికీ.. అతని పదవీ కాలాన్ని పొడగించారు.
మరోవైపు పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే మొన్నటి వరకు అభిమానుల్లో కాకుండా ప్లేయర్లలో కూడా టెన్షన్ ఉండేది. కానీ పహల్గామ్ దాడి తరువాత ఆ జట్టుతో అస్సలు క్రికెట్ మ్యాచ్ లే ఆడొద్దనే డిమాండ్లు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఆడేందుకు టీమిండియాకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా ఇండియా-పాక్ జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. మరోవైపు ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టికెట్ల సేల్ ను బట్టి అర్థం అవుతోంది. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే తలపడుతోంది. ఆ మ్యాచ్ ల్లో కూడా ఆడొద్దని డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. బీసీసీఐ మాత్రం వద్దని చెప్పలేదు. దేశ భక్తి కంటే క్రికెట్ ఎక్కువైందా..? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇవాళ జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవ్వరూ విజేతగా నిలుస్తారో చూడాలి మరీ.