
Quinton De Kock : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన సౌతాఫ్రికా మ్యాచ్ లో డికాక్ అరుదైన ఘనత సాధించాడు. తను నిజానికి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్. ఇప్పుడు రెండింటా రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నాడు. ఆఫ్గాన్ మ్యాచ్ లో ఆరు క్యాచ్ లు అందుకుని ఒక అరుదైన రికార్డ్ ను సమం చేశాడు.
ప్రపంచంలో ఒకే మ్యాచ్ లో ఆరు క్యాచ్ లు పట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫ్ రాజ్ పేరున ఉన్న రికార్డ్ ను సమం చేశాడు.
అప్ఘాన్ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్,ఇక్రమ్ అలిఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, హష్మతుల్లా షాహిది, నూర్ అహ్మద్‌ల క్యాచ్‌లు పట్టిన క్వింటన్ డికాక్ వీరిద్దరితో సమానంగా నిలిచాడు.
2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. 2003 ప్రపంచకప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు పట్టాడు.
వీటన్నింటితో పాటు డికాక్ మరో చక్కని రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ 2023లో.. 16 మందిని అవుట్ చేసి నంబర్ వన్ గా ఉన్నాడు. అంతేకాదు ఒక టోర్నమెంట్ లో అత్యధిక మందిని అవుట్ చేసిన తొలి సౌతాఫ్రికా కీపర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. కాకపోతే వన్డే ప్రపంచకప్ లో టోటల్ గా అన్ని మ్యాచ్ ల్లో కలిపి 21మందిని అవుట్ చేసి ఆడమ్ గిల్ క్రిస్ట్ తొలిస్థానంలో ఉన్నాడు.
ఇప్పుడు డికాక్ కి ఆ రికార్డ్ కొట్టాలంటే సెమీస్ లో అయితే ఒక అవకాశం ఉంది. అక్కడ ఆస్ట్రేలియాపై గెలిస్తే మరొక అవకాశం వస్తుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో మరో ఆరు అవుట్ల లో పాలు పంచుకుంటే గిల్ క్రిస్ట్ ను దాటి తనే నెంబర్ వన్ అవుతాడు.