Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. అసలు సంగతి అదే..

Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. అసలు సంగతి ఇదే..

Chandra Mohan
Share this post with your friends

Chandra Mohan

Chandra Mohan : టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో చంద్రమోహన్ ఈరోజు అనారోగ్య కారణంగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఉదయం 9:45 నిమిషాలకు కన్నుమూశారు. చంద్రమోహన్ తన 50 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలపాటు లక్కీ హీరోగా పేరుపొంది మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఆస్తులకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

విలక్షణమైన పాత్రను పోషించడంలో దిట్టగా పేరుపొందిన చంద్రమోహన్ కేవలం నటుడిగానే కాక విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. నటించడమే కాక తన కెరీర్ లో చంద్రమోహన్ బాగా సంపాదించాడు కూడా. మురళీమోహన్ ,శోభన్ బాబు లాగానే చంద్రమోహన్ కూడా తాను సంపాదించిన డబ్బును ఎక్కువగా భూమిపై పెట్టుబడి పెట్టాడు. మొత్తానికి చంద్రమోహన్ ఆస్తి విలువ సుమారు 300 కోట్లకు పైగా ఉంటుంది అని టాక్. ఈ నేపథ్యంలో ఆయన డబ్బులు నష్టపోయారు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం..

శోభన్ బాబుకు చంద్రమోహన్ దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసి వస్తుంది అన్న నమ్మకం ఉండేదట. అందుకే ఆయన దగ్గర అదే పనిగా అడిగిమరీ డబ్బు తీసుకునే వారట. ఇప్పటికీ జనవరి ఫస్ట్ న చాలా మంది తమ ఇంటికి వచ్చి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారు అని ఆయన భార్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రమోహన్ శోభన్ బాబు విషయంలో కాస్త భావోద్వేగానికి గురి అయ్యి కొన్ని సంగతులు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు చెప్పిన ఫైనాన్షియల్ అడ్వైస్ వినకుండా కొన్ని డెసిషన్స్ తీసుకుని నష్టపోయాను అని వాపోయారు.

ఇంతకీ విషయం ఏమిటంటే అప్పట్లో కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీ రావు ఒక ద్రాక్ష తోటను తీసుకోవడం జరిగిందట. మారుతీ రావు సలహా మీద చంద్రమోహన్ కూడా అక్కడే 35 ఎకరాలు కొన్నారు. కానీ దాన్ని మేనేజ్ చేయలేక చివరికి అమ్మేశారు. అలాగే మద్రాసులో 15 ఎకరాలు అమ్మ పోయినప్పుడు శోభన్ బాబు వద్దు అన్నారట.. అయినా చంద్రమోహన్ ఆ భూమిని అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి ఖరీదు 30 కోట్లకు పైగానే ఉంది. ఇక ఇది కాక హైదరాబాద్ లోని శంషాబాద్ మెయిన్ రోడ్డు దగ్గర ఆరు ఎకరాలు కొని అమ్మేశారట చంద్రమోహన్. 

అలా అప్పుడు తాను వద్దు అనుకుని చాలా తక్కువ ధరకు అమ్మేసిన ఆస్తులు ఇప్పుడు దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేస్తాయని.. అను జీవితంలో సంపాదించిన దాని కంటే ఎక్కువ పోగొట్టుకున్నాను అని చంద్రమోహన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కువ ప్రాఫిట్ రావాల్సిన వాటిని తక్కువ ధరకు అమ్ముకున్నాను అనే ఆయన ఉద్దేశం తప్ప అసలు ఏమీ లేకుండా రోడ్డు మీద నిల్చున్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఆయన ఆస్తి నష్టపోయారు అని భావిస్తున్నారు. కానీ అసలు విషయం ఇది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Bandi Sanjay: బండి అరెస్టుతో ఢిల్లీకి ఇచ్చిన మెసేజ్ ఏంటి? కవిత కోసమేనా..?

Bigtv Digital

Corona Virus : చైనాలో కరోనా డేంజర్ బెల్స్..భారత్ అలెర్ట్..

BigTv Desk

ICC Women’s T20 World Cup : ఐర్లాండ్ పై విక్టరీ.. సెమీస్ కు భారత్ మహిళల జట్టు..

Bigtv Digital

Nani: జెర్సీ నష్టాలు తెచ్చిందా..? కౌంటర్ తో నాని క్లారిటీ..

Bigtv Digital

Allu Arjun for BRS : పొలిటికల్ అల్లుడు!.. మామ కోసం అర్జున్ ఎంట్రీ!?

Bigtv Digital

AP Political News: కాపుల కాక.. పవన్‌ను పద్మనాభంతో కార్నర్ చేస్తున్నారా?

Bigtv Digital

Leave a Comment