E-Paper
Advertisement

South Africa Vs Srilanka: సౌత్ ఆఫ్రికా విధ్వంసం….. ఒకే మ్యాచ్ లో మూడు సెంచరీలు

South Africa Vs Srilanka: సౌత్ ఆఫ్రికా విధ్వంసం….. ఒకే మ్యాచ్ లో మూడు సెంచరీలు
Advertisement

South Africa Vs Srilanka: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరిగాయి. అయితే ఈ రెండు తమదైన శైలిలో రికార్డులు సృష్టించాయి. పొద్దున బంగ్లాదేశ్ ,ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. అతి స్వల్ప స్కోర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ఒక రికార్డు సృష్టిస్తే. సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రి కా భారీ స్కోర్ చేసి మిగిలిన అన్ని టీములకు పెద్ద సవాల్ విసిరారు. సన్ రైజర్స్ కెప్టెన్…ప్రస్తుత వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా టీం వైస్ కెప్టెన్…మార్క్రమ్ ఈరోజు ఆడిన ఆట చరిత్రలోనే ఒక విధ్వంసకరమైన ఆటగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఓపెన్ డికాక్ , వన్ డౌన్ బ్యాట్స్ మెన్ వాన్ డెర్ డస్సెన్ వరుస సెంచరీలతో పటిష్టంగా మారిన సౌత్ ఆఫ్రికన్ స్కోర్ బోర్డు ను మెరుపు సెంచరీతో మార్క్రమ్ పరుగులు పెట్టించి భారీ స్కోరు సాధించాడు. ఈరోజు సౌత్ ఆఫ్రికా స్కోర్ చూసిన తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ లెక్కలు మారక తప్పదు అని అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కి ముందు ఒక లెక్క.. మ్యాచ్ అయ్యాక ఒక లెక్క అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీ,అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా నాటకాలు ఏకంగా ముగ్గురు సెంచరీలతో శ్రీలంక టీం పై విరుచుకుపడ్డారు.

Advertisement

ఈ ముగ్గురు దాటికి బౌండరీ వద్దకు పరుగులు పెడుతున్న బాల్ ని ఆపలేక లంక ప్లేయర్స్ నానా తంటాలు పడ్డారు. ఈరోజు మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించిన సౌత్ ఆఫ్రికన్ టీం ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
డికాక్ 84 బంతులలో 100 పరుగులు సాధించి భారీష్ కోర్టు తొలిత పునాది వేశాడు.. అతని వెనకే వాన్ డర్ 108 పరుగులు సాధించి పటిష్టమైన భాగస్వామ్యాన్ని అందించాడు.

ఇదంతా ఒక ఎత్తు అయితే కేవలం మార్క్రమ్ ఆడిన ఆట ఒక ఎత్తు.. 49 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. అతని ఆట చూసి…. అబ్బా ఏం కొట్టాడు రా…. ఇది కదా అసలు క్రికెట్ అంటే.. అని ప్రత్యర్థి శ్రీలంక జట్టు కూడా అనుకోకుండా ఉండదు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే చాలా తక్కువ బాల్స్ కు సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అతి తక్కువ బాల్స్ ఎదుర్కొని సెంచరీ చేసిన రికార్డ్ కెనడా ప్లేయర్ కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. 50 బంతుల్లో కెవిన్ సెంచరీ సాధించి నెలకొల్పిన రికార్డును 49 బంతుల్లోనే సెంచరీ కొట్టి మార్క్రమ్ అధిగమించాడు.

Advertisement

మొత్తానికి తమ బ్యాటింగ్ ముగించిన సౌత్ ఆఫ్రికా 428 పరుగుల భారీ లక్ష్యాన్ని లంకేయుల ముందు ఉంచింది. సౌత్ ఆఫ్రికా లంక దహనం నుంచి లంకవాసులు ఎలా బయటపడతారు చూడడానికి స్టేడియం లో జనాలే కాదు ఇంట్లో ప్రేక్షకులు కూడా టీవీ ముందు కదలకుండా కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంక నెగ్గడం అంటే అంతకంటే పెద్ద రికార్డు ఇంకొకటి ఉండదు మరి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×