BigTV English

South Africa Beats Sri Lanka: లంకపై ఢంకా మోగించిన దక్షిణాఫ్రికా.. తొలి మ్యాచ్ లోనే ఘనవిజయం

South Africa Beats Sri Lanka: లంకపై ఢంకా మోగించిన దక్షిణాఫ్రికా.. తొలి మ్యాచ్ లోనే ఘనవిజయం

South Africa Beats Sri Lanka: ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరు సాధించడమే కాకుండా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా…. పది పరుగుల వద్ద అవుట్ అయినా సరే…. రెండవ వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి డి కాక్, రాస్సీ వాన్ డెర్ డుసెన్ దక్షిణ ఆఫ్రికా తరఫున భారీ స్కోర్ చేయడానికి బాటను ఏర్పాటు చేశారు. రెండవ వికెట్ కోల్పోయే సమయానికి ఈ ఇద్దరు 174 బంతులలో 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోరుగా సాగుతున్న ఈ భాగస్వామ్యానికి లంక బౌలర్ పతిరనా బ్రేక్ వేయడంతో జోరు తగ్గలేదు సరి కదా మరింత పెరిగింది.


తర్వాత బరిలోకి వచ్చిన ఐడెన్ మార్క్రామ్ ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ప్రత్యర్ధుల పై ఎదురు దాడి చేశాడు. వన్డే కెరియర్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసి తన ఖాతాలో మరొక కొత్త రికార్డును జత చేసుకున్నాడు. 49 బంతుల్లో సెంచరీని పూర్తిచేసిన మార్క్రామ్ పరాక్రమమైన బ్యాటింగ్ షాట్స్ కు లంకవాసులు గ్రౌండ్ మొత్తం పరుగులు పెట్టారు. అతను తన సెంచరీని సిక్స్ కొట్టి ముగించడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు 429 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొదట టాస్ గెలిచిన శ్రీలంక… తమ బౌలింగ్ పై ఉన్న నమ్మకంతో మొదట ఫీల్డింగ్ ఎంచుకొని ఇరకాటంలో పడింది. దక్షిణాఫ్రికా జోరు ముందు లంక బౌలర్లు చల్లాచెదురు అయ్యారు. ఒకే మ్యాచ్లో ముగ్గురు దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్మెన్ విజృంభించడంతో మూడు సెంచరీలు నమోదయ్యాయి.దక్షిణాఫ్రికా తరపున రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (108), క్వింటన్ డి కాక్( 100), ఐడాన్ మార్క్‌రామ్(106) సాధించడంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.


భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక టీం మొదటినుంచి కాస్త తడబడుతూనే ఉంది. మొదటి 10 ఓవర్లలో శ్రీలంక కాస్త ఆధిపత్యాన్ని చూపించిన ఆ తరువాత మెత్తబడిపోయింది. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లో కూడా సౌత్ ఆఫ్రికా విజృంభించడంతో లంక బ్యాట్స్మెన్ కాస్త ఇబ్బంది పడ్డారు.కుసల్ మెండిస్ 76,చరిత్ అసలంక 79, దసున్ షనక 68, రజిత. 33,సదీర సమరవిక్రమ 23 పరుగులు సాధించగా మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు.
అయినా లక్ష్యసాధనలో వెనుకంజ వేయకుండా 326 పరుగులు చేయగలిగారు. మొత్తానికి దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ లో విజయ ఢంకా మోగించింది.

Related News

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Asia Cup 2025 : టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవ‌రు..చిలుక జోష్యం ఇదే

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Big Stories

×