BigTV English

New Zealand vs South Africa : దంచికొట్టిన సౌతాఫ్రికా.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్

New Zealand vs South Africa : దంచికొట్టిన సౌతాఫ్రికా.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్

New Zealand vs South Africa : సౌతాఫ్రికా దూకుడుకి కళ్లెం వేయడం ఎవరివల్లా కావడం లేదు. ఆ రోజున మరి పసికూన నెదర్లాండ్ చేతిలో ఎలా ఓడిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ జట్టే…ఈ జట్టా…? అనే ఆశ్చర్యం కూడా వేస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో పుణెలో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా మళ్లీ దంచికొట్టింది. 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


మొన్ననే ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్ లో 387 పరుగుల లక్ష్యాన్ని కివీస్ దగ్గరగా వెళ్లి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆరోజు పోరు ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. అలాగే ఇప్పుడు కూడా సౌతాఫ్రికా ఇచ్చిన 357 పరుగులను కివీస్ అలవోకగా దాటేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మరీ దారుణంగా 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్ప కూలిపోయింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అదెంత తప్పో తర్వాత వారికి తెలిసింది. బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా ఓపెనర్లు 8.3 ఓవర్ల వరకు జాగర్తగానే ఆడారు. 38 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.  తెంబా బావుమా(24) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన వాండర్ డసెన్ (138)తో కలిసి ఓపెనర్ క్వింటన్ డికాక్ (114) స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. ఇలా ఇద్దరూ శతక్కొట్టారు.


జట్టు స్కోరు 40 ఓవర్ల దగ్గర 238 పరుగుల వద్ద డికాక్ రూపంలో కివీస్ కి రెండో వికెట్ దక్కింది. హమ్మయ్యా.. అనుకున్నారు. కానీ  ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. డేవిడ్ మిల్లర్ వచ్చాడు 30 బంతుల్లో 53 పరుగులు చేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. తర్వాత క్లాసెన్ (15), మార్ క్రమ్ (6) చేయడంతో 4 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలింగ్ లో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్, ఒక్కో వికెట్టు అతికష్టమ్మీద తీశారు. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ ఏడుగురు ఆటగాళ్లను బౌలర్లుగా ప్రయోగించినా ఫలితం దక్కలేదు.

తర్వాత ఛేజింగ్ కి వచ్చిన కివీస్ ఏ దశలోనూ పోరాడే ప్రయత్నం చేయలేదు. ఆస్ట్రేలియాపై మెరిసిన మెరుపులు ఇక్కడ కనిపించ లేదు. గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే 60 పరుగులు చేశాడు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. గత మ్యాచ్ లో సెంచరీ వీరుడు రచిన్ రవీంద్ర (9), డేవాన్ కాన్వే (2), టామ్ లేథమ్ (4), జేమ్స్ నీషమ్ (0), మిచెల్ శాంటర్న్ (7) ఇలా అందరూ ఏదో హడావుడిగా వచ్చి వెళ్లిపోయారు. మొత్తానికి 35.3 ఓవర్లలో 167 పరుగులకి అంతా ఆలౌట్ అయిపోయారు.

సౌతాఫ్రికా బౌలింగ్ లో కేశవ్ మహరాజ్ అద్భుతంగా స్పిన్ తిప్పాడు. బాల్ ఎక్కడ పడి ఎలా తిరిగి వికెట్ల మీదకి వెళ్లిందో కూడా బ్యాట్స్ మెన్ కి అర్థం కాలేదు. డిఫెన్స్ ఆడి కూడా బ్యాట్స్ మెన్లు వికెట్లు కోల్పోయారంటే ఆ బాల్ ఎంత గొప్పగా టర్న్ అయ్యిందో అర్థమవుతుంది. తను 4 వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ 3, కోయెట్లి 2, రబాడ ఒక వికెట్టు తీశారు.

దీంతో టేబుల్ టాప్ లోకి సౌతాఫ్రికా వెళ్లింది. సెకండ్ ప్లేస్ లోకి ఇండియా వచ్చింది. థర్డ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా, అనూహ్యంగా ఫోర్త్ ప్లేస్ లోకి న్యూజిలాండ్ మారిపోయింది. వరల్డ్ కప్ చివరికి వచ్చేసినా, ఒక్క బంగ్లాదేశ్ కి తప్పించి అన్ని జట్లకి సెమీస్ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×