BigTV English

SRH Vs RR Qualifier 2 Match Report: స్పిన్నర్లు తిప్పేశారు.. హైదరాబాద్ ను గెలిపించారు!

SRH Vs RR Qualifier 2 Match Report: స్పిన్నర్లు తిప్పేశారు.. హైదరాబాద్ ను గెలిపించారు!

Spinners Key Role in Sunrisers Hyderabad Win in IPL 2024 Qualifier 2: ఐపీఎల్ 2024 సీజన్ లో ఊహించని జట్టు ఫైనల్ కి చేరింది. మొదటి నుంచి కప్ రేస్ లో ఉంటుందని భావించిన రాజస్థాన్ నాకౌట్ మ్యాచ్ లో ఇంటి దారి పట్టింది. కానీ ఈ రెండు జట్ల మధ్య ఈరోజు లోపాలను చూస్తే, రాజస్థాన్ స్పిన్నర్లు ఫెయిలైన ఇదే పిచ్ పై హైదరాబాద్ స్పిన్నర్లు అదరగొట్టారు. బాల్ ని ఎడాపెడా తిప్పి పారేసి, వికెట్ల మీద వికెట్లు తీసి, మ్యాచ్ ని తమ చేతుల్లోకి తెచ్చారు.


నిజానికి 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ కి యశస్వి రూపంలో మంచి స్కోరు వచ్చింది. తను ఉన్నంతవరకు మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోనే ఉంది. నిజానికి యశస్వి ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే, ఇంకతన్ని అవుట్ చేయడం ఎవరి తరం కాదు.. వాటిని భారీ స్కోర్ల దిశగా తీసుకువెళతాడు. అలాంటి యశస్విని లెఫ్టార్మ్ స్పిన్నర్ షబాజ్ అహ్మద్ అవుట్ చేశాడు. అదిగో అక్కడ నుంచి స్పిన్నర్ల హవా మొదలైంది. ఆ క్రమంలో తను కీలకమైన 3 వికెట్లు తీశాడు.

తర్వాత ఆల్ రౌండర్ అయిన అభిషేక్ శర్మ కూడా తక్కువ తినలేదు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇరగదీసి ఆడిన కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ తీశాడు. దాంతోపాటు బ్యాట్ తో పిడుగులు కురిపించగల హిట్ మెయర్ వికెట్ తీసి, మ్యాచ్ ని పూర్తిగా వన్ సైడ్ చేసేశాడు. ఇలా ఇద్దరు స్పిన్నర్లు కలిసి 5 వికెట్లు తీసి హైదరాబాద్ ను గెలిపించారు.


Also Read: ఇవే మా ఓటమికి కారణాలు: సంజూ శాంసన్

చెన్నయ్ పిచ్ మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి ఒకేలా ఉంది. అందువల్ల సెకండ్  బ్యాటింగ్ లో ఉన్న మూమెంట్ ఫస్ట్ బ్యాటింగులో కూడా ఉంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ని నిలువరించడంలో రాజస్థాన్ ప్రధాన స్పిన్నర్లు, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ విఫలమయ్యారు. ఇద్దరికీ ఒక్క వికెట్టు కూడా దక్కలేదు.

అదే రాజస్థాన్ పాలిట దురదృష్టంగా మారింది. అదీకాకుండా అశ్విన్ అయితే ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించిన అశ్విన్, ఇదే సొంత మైదానంలో విఫలమైన తీరుపై నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. అందరూ ఆడితేనే ఏ కెప్టెన్ అయినా వ్యూహాలు పన్నగలడు గానీ, 11 మందిలో ఒకరిద్దరు ఆడి, మిగిలినవాళ్లు విఫలమైతే తను మాత్రం ఏం చేస్తాడని సంజూ శాంసన్ పై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. ఇంతవరకు తీసుకువచ్చినందుకు అతన్ని మనం కూడా అభినందించాలని అంటున్నారు. నిజమే కదా.. మనం బెస్టాఫ్ లక్ చెబుదాం. టీ 20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాలని ఆశిద్దాం.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×