Sreesanth On MS Dhoni: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని (MS Dhoni) మొన్నటి వరకు మెచ్చుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth).. ఒక్కసారిగా అతని గాలి తీసేశాడు. తన బౌలింగ్ లో ఆడేందుకు మహేంద్రసింగ్ ధోని చాలా భయపడి పోతాడని… ప్యాంటు కూడా తడిపేసుకుంటాడంటూ బాంబు పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) సందర్భంగా గతంలో మహేంద్రసింగ్ ధోనిని తాను ఔట్ చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ధోనిపై శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అతడు చేసిన వ్యాఖ్యలకు మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి, సొంత జట్టుకే వెన్నుపోటు పొడిచే శ్రీశాంత్… బౌలింగ్ కు భయపడి పోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కౌంటర్లు పేల్చుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి శ్రీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీని క్లీన్ బౌల్డ్ చేసేందుకు తాను ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తనకు ఆడే అవకాశాన్ని ఎప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కల్పించలేదని వెల్లడించారు. తన బౌలింగ్ లో మహేంద్రసింగ్ ధోని క్లీన్ బౌల్డ్ అవుతాడన్న భయంతో.. జట్టులోకి తీసుకోలేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో 22 మ్యాచ్ లు ఆడినట్లు గుర్తు చేశారు. ఇందులో తనకు అవకాశం ఇచ్చి ఉంటే… ఇప్పటికే 22 సార్లు ధోనిని క్లీన్ బౌల్డ్ చేసేవాడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని వికెట్ తీయాలన్న కసితో ఇప్పటికీ ఉన్నానని తెలిపారు. ధోని సిద్ధంగా ఉంటే, అతన్ని ఔట్ చేసేందుకు రెడీ ఉన్నానని సవాల్ విసిరారు. కానీ ఇప్పటి వరకు ధోనిని శ్రీశాంత్ క్లీన్ బౌల్డ్ చేయలేదన్న విషయం తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై శ్రీశాంత్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీకి టీమ్ ఇండియాను అప్పగించాలని డిమాండ్ చేశారు. 2007 నుంచి 2013 వరకు టీమిండియాను అద్భుతంగా మహేందర్ సింగ్ ధోని ముందుకు తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన మొనగాడు ధోని ఒక్కడేనని వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే టీమిండియా బాధ్యతలను ధోనీకి అప్పగించాలని కోరారు. గౌతమ్ గంభీర్ చేతిలో పెడితే టీమిండియా… గెలవడం కష్టమేనని హెచ్చరించారు.