
SRH vs CSK(IPL Match Updates): ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ టీం 5 మ్యాచుల్లో రెండింట్లో గెలిచి 9వ ప్లేస్ లో కొనసాగుతోంది.
సన్ రైజర్స్ పై చెన్నై టీంకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 18 మ్యాచులు ఆడగా.. 13 చెన్నై, ఐదు హైదరాబాద్ టీం గెలిచింది. సన్ రైజర్స్ పై చెన్నై టీం చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు. 2014, 2015, 2019, 2020 సీజన్‌లలో హైదరాబాద్ జట్టు ఒక్కో మ్యాచు చెన్నై టీంపై గెలిచింది. 2018 సీజన్ లో హైదరాబాద్ తో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ చెన్నై జట్టే విజేతగా నిలిచింది.
హైదరాబాద్ జట్టులో హ్యారీ బ్రూక్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే.. అతన్ని కట్టడి చేయడంపై ధోనీసేన ప్రత్యేక వ్యుహలు రచిస్తోంది. పేస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న హ్యారీ బ్రూక్.. స్పిన్ ను మాత్రం అంతలా మేనేజ్ చేయలేకపోతున్నాడు. దీన్ని గుర్తించిన చెన్నై టీం శ్రీలంక స్పిన్నర్ తీక్షణను జట్టులోకి తీసుకుని.. పవర్ ప్లేలో బౌలింగ్ వేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చెన్నై టీంపై హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మంచి రికార్డు ఉంది. ఒక్క ధోనీ మినహా మిగతా చెన్నై ఆటగాళ్లను తమ స్వింగ్ తో ముప్పుతిప్పలు పెట్టగల సత్తా భువీకి ఉంది. చెన్నైలో లెఫ్టాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని కట్టడి చేయడంలో వాషింగ్టన్ సుందర్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుందర్ ఆడిన గత నాలుగు సీజన్లను గమనిస్తే.. లెఫ్టాండర్లకు ఆయన ఎకానమీ రేటు 6.33గా ఉంది.
మరి, సొంతగడ్డపై చెన్నై చెలరేగిపోతుందా? చెన్నైకే సన్‌రైజర్స్ షాక్ ఇస్తుందా?