BigTV English

Sri Lanka Vs Netherlands: బోణీ కొట్టిన.. శ్రీలంక..

Sri Lanka Vs Netherlands: బోణీ కొట్టిన.. శ్రీలంక..

Sri Lanka Vs Netherlands: మొత్తానికి శ్రీలంక ఖాతా తెరిచింది. వరుస హ్యాట్రిక్ లతో తడబడుతూ పాయింట్ల పట్టకలో పదో స్థానంలో పడిపోయిన దశలో నెదర్లాండ్ పై గెలిచి ఒక స్థానం పైకి వచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా లక్నో వేదికగా జరిగిన నెదర్లాండ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా అయితే జరగలేదు. దక్షిణాఫ్రికాపై గెలిచిన నెదర్లాండ్ ను శ్రీలంక తక్కువ అంచనా వేయలేదు. జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. అయితే ఓడినా సరే, డచ్ టీమ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.


మొదట టాస్ గెలిచి నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అదెంత పొరపాటు నిర్ణయమో వారికి అర్థమయ్యేసరికి 6 వికెట్లు టపటపా పడిపోయాయి. ఒక దశలో 91 పరుగులకే 6 వికెట్లతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
అప్పుడు వచ్చాడండి…సిబ్రాండ్ ఎంగల్ బ్రెచ్డ్ చకచకా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అదురు లేదు, బెదురు లేదు, అంతవరకు అదే శ్రీలం బౌలర్లు ఆరు వికెట్లు తీసి అల్లాడించారు. అలాంటివారిని తను అల్లాడించడం మొదలుపెట్టాడు. అయితే తనకి లోగాన్ వాన్ బీక్ సపోర్టుగా నిలిచాడు. 21 ఓవర్ దగ్గర నుంచి 45 ఓవర్ వరకు వీరిద్దరే ఆడుకున్నారు. 221 పరుగుల వద్ద సిగ్మండ్ (70) అవుట్ అయ్యాడు. 4 ఫోర్లు 1 సిక్స్ తో ఎంతో జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. తర్వాత 48 ఓవర్ లో వాన్ బీక్ (59) అవుట్ అయ్యాడు. మొత్తానికి డచ్ టీమ్ 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసింది. శ్రీలంక కు గట్టి సవాల్ నే విసిరింది.

శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 4 వికెట్లు, కసున్ రజిత 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఛేజింగ్ కి దిగిన శ్రీలంక జట్టు ఆచితూచి ఆడింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలైన శ్రీలంకను ఎలాగైనా నిలువరించగలమనే ధృడమైన నమ్మకంతో నెదర్లాండ్ బౌలింగ్ ప్రారంభించింది. వారి నమ్మకం వమ్ము కాలేదు. 5 ఓవర్ లో ఓపెనర్ కుశాల్ పెరీరా (5) వికెట్ తీశారు. పదో ఓవర్ లో కుశాప్ మెండిస్ (11) ను అవుట్ చేసి మ్యాచ్ ని రసవత్తరంగా మార్చేశారు. అప్పటికి 9.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి శ్రీలంక 52 పరుగులతో ఉంది. మరో సంచలనం నమోదవుతుందనే అనుమానాన్ని అందరిలో కలిగించారు.


సెకండ్ డౌన్ బ్యాటింగ్ కి వచ్చిన సదీర సమరవిక్రమ మొండిగా నిలుచున్నాడు.
ఒక వైపు నుంచి వికెట్లు పడుతున్నా తను మాత్రం మొక్కవోని ధైర్యంతో పోరాడాడు. డిఫెన్స్ ఆడుతూనే అవసరమైనప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. రన్ రేట్ పడకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలోనే 91 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.అతడికి మరో ఓపెనర్ నిశాంక (54) , అసలంక (44) సహకారం అందించారు. దీంతో మరో పది బంతులు ఉండగానే శ్రీలంక ఎట్టకేలకు విజయం సాధించింది. వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది. అట్టడుగు స్థానం నుంచి పైకి ఒక స్థానం ఎగబాకి 9కి చేరింది. ఆఫ్గనిస్తాన్ పదికి పడిపోయింది. నెదర్లాండ్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసుకున్నాడు.

Related News

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

Kusal Perera Injury : చావు బతుకుల్లో శ్రీలంక క్రికెటర్.. తలకు బంతి తగలడంతో.. వీడియో వైరల్

Big Stories

×